Kalvakuntla Kavitha:బీఆర్ఎస్ పార్టీపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం (ఆగస్టు 3) ఆమె ఓ చానల్‌తో మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా ఆమె బీఆర్ఎస్ అధినాయకత్వంతో విభేదిస్తూ వస్తున్నారు. ఆమె వైఖరిపై ఆ పార్టీ అధినేత కేసీఆర్ సహా సైలెంట్ అయ్యారు. అయితే ఇటీవల మాజీ మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి సహా కొందరు కవితపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. కవిత వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ మాట్లాడారు.
Kalvakuntla Kavitha:ఆ వ్యాఖ్యలను కవిత ఎదుట ప్రస్తావించగా, ఆమె స్పందించారు. బీఆర్ఎస్ పార్టీలో తాను లైఫ్‌టైమ్ సభ్యురాలినని కవిత తేల్చి చెప్పారు. తమ మధ్య అభిప్రాయభేదాలే తప్ప, భేదాభిప్రాయాలు కాదని తెలిపారు. తాను తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు రాసిన లేఖను లీక్ చేసిందెవరో చెప్పాలన్నదే తన డిమాండ్ అని పేర్కొన్నారు. వాళ్లను పట్టుకునేవరకూ తాను పార్టీకి దూరంగానే ఉండాలని అనుకుంటున్నట్టు ఎమ్మెల్సీ కవిత స్పష్టంచేశారు.
Kalvakuntla Kavitha:బీసీల అంశంపైనా ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలంటే నాలుగైదు కులాలు మాత్రమే కాదని చెప్పారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైనా అంతర్గతంగానే మాట్లాడాలని చెప్పారు. బీసీల కోసం గురుకులాలు ఏర్పాటు చేశామని తెలిపారు. వృత్తిపనులకు చేయూతనిచ్చే కార్యక్రమాలు ఎన్నో చేశామని చెప్పారు. రిజర్వేషన్లపై 50 శాతం క్వాప్ ఎత్తేసిన తర్వాత బీసీఉద్యమం ఊపందుకున్నదని తెలిపారు.
Kalvakuntla Kavitha:బీసీ రిజర్వేషన్ల అమలు కోసం బీజేపీపై కాంగ్రెస్ ఒత్తిడి చేయకుండా పోరాటం చేసే తమపై విమర్శలు చేయడమేమిటని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ముస్లింలు, బీసీలకు కలిపి 56 శాతం రిజర్వేషన్లు ఉండాలని, కానీ, రేవంత్‌రెడ్డి 42 శాతం రిజర్వేషన్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు. ఆర్డినెన్స్ ద్వారా బీసీ రిజర్వేషన్లను అమలు చేయొచ్చని, సెప్టెంబర్ 30 వరకు ఉన్న డెడ్‌లైన్ లోపు ఆర్డినెన్స్ ద్వారా బీసీ రిజర్వేషన్లను అమలు చేయవచ్చని సూచించారు.