Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర రాజకీయాల్లో కీలక అడుగు వేయబోతున్నారు. ఆమె త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ‘తెలంగాణ యాత్ర’ చేయనున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ చివరి వారం నుంచి ఈ యాత్ర మొదలుకానుంది.
యాత్రలో ప్రత్యేకత ఏమిటి?
ఈ యాత్ర ద్వారా కవిత అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. ముఖ్యంగా, ఈ యాత్ర పోస్టర్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో బదులు, తెలంగాణ సిద్ధాంతకర్త అయిన ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోను మాత్రమే ఉపయోగించనున్నట్లు సమాచారం.
ఈ నిర్ణయం యాత్రకు మరింత ప్రాధాన్యతను తీసుకురానుంది. కవిత తన యాత్రలో ఎక్కువగా విద్యావంతులు, మేధావులతో సమావేశాలు నిర్వహించనున్నారు. తెలంగాణ సాంప్రదాయం, విద్య, సాంకేతిక రంగాలలో కృషి చేసిన ప్రముఖులు, మేధావులను ఆమె కలుస్తారు. వారి ద్వారా ప్రజలకు నేరుగా సందేశాలు చేరవేయనున్నారు.
పోస్టర్ విడుదల ఎప్పుడు?
ఈ యాత్రకు సంబంధించిన పోస్టర్‌ను కవిత రేపు (అక్టోబర్ 15, బుధవారం) అధికారికంగా విడుదల చేయనున్నారు. యాత్ర పూర్తి వివరాలు, షెడ్యూల్, ఎక్కడెక్కడ సమావేశాలు జరుగుతాయి అనే వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.