Kalvakuntla Kavitha: సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌లో చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. దుబాయ్‌లో కేదార్ మృతి, రాజలింగమూర్తి హత్య, మరొకరి మృతిపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. వరుస హత్యలపై అనుమానాలు ఉన్నాయంటూ తెలిపారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఖండించారు. ప్రధాని మోదీ డైరెక్షన్‌లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ సీఎంగా రేవంత్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దుబాయ్‌లో డైరెక్టర్ కేదార్ మృతి, రాజలింగమూర్తి హత్యతో తమ కుటుంబానికి ఏమి సంబంధమని ప్రశ్నించారు.
Kalvakuntla Kavitha: ప్రధాని మోదీని కలిసిన తర్వాత సంబంధం లేని అంశాలపై సీఎం రేవంత్ మాట్లాడారని కల్వకుంట్ల కవిత తెలిపారు. తమ కుటుంబంపై కుట్ర జరుగుతుందని అనుమానం ఉన్నదని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. మోదీని కలిసిన తర్వాత రేవంత్‌రెడ్డి పాత్రికేయులతో చిట్‌చాట్‌లో ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడితే, ఆధారాలు లేకుండా వార్తలు ఎలా రాస్తారంటూ ఓ ప్రధాన పత్రికను చూపుతూ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
Kalvakuntla Kavitha: ఇది దేనికి సంకేతమంటూ ఆ పత్రిక కథనాన్ని మీడియాకు చూపుతు కవిత మండిపడ్డారు. ఆధారాలు లేకుండా ఎలా రాస్తారంటూ ప్రశ్నించారు. అంతిమంగా ఏం చేద్దామనుకున్నారంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణకు రక్షణ కవచంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఇబ్బందులు పెట్టాలని, కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేయాలని చూస్తున్నారా? అని ఆందోళన వ్యక్తంచేశారు.