Kalki New Record: ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ పోర్టల్ ఐఎండీడీలో ‘కల్కి 2898 ఎ.డి.’ సరికొత్త రికార్డ్ ను నెలకొల్పింది. ప్రపంచవ్యాప్తంగా విశేషఆదరణ పొందిన పది భారతీయ చిత్రాల జాబితాలో ‘కల్కి’ మూవీ అగ్ర స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో ‘స్త్రీ-2’ సినిమా, మూడో స్థానంలో తమిళ చిత్రం ‘మహరాజా’ చోటు దక్కించుకున్నాయి.
ఇక ఆ తర్వాత వరుసగా ‘సైతాన్, ఫైటర్, మంజుమ్మల్ బాయ్స్, భూల్ భులయ్యా -3, కిల్, సింగమ్ అగైన్, లా పతా లేడీస్” చిత్రాలు ఉన్నాయి. ప్రభాస్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ‘కల్కి 2898 ఎ.డి.’ సినిమాకు లభించిన ఆదరణతో మరోసారి తేటతెల్లమైంది.
ఇది కూడా చదవండి:Arvind Kejriwal: మహిళలకు అరవింద్ కేజ్రేవాల్ బంపర్ ఆఫర్
వేదిక డ్యుయల్ రోల్ తో ‘ఫియర్’
వేదిక లీడ్ రోల్ ప్లే చేసిన ‘ఫియర్’ మూవీ ఈ నెల 14న జనం ముందుకు వస్తోంది. విశేషం ఏమంటే ఇప్పటికే ఈ సినిమా పలు అంతర్జాతీయ చిత్రోత్సవాలలో అవార్డులను కైవసం చేసుకుంది. ఇందులో వేదిక ద్విపాత్రాభినయం చేసిందనే విషయాన్ని మేకర్స్ రివీల్ చేశారు. తాజాగా జరిగిన ‘ఫియర్’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో దర్శకురాలు డాక్టర్ హరిత గోగినేని మాట్లాడుతూ కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా ఇదని అన్నారు. ఈ సినిమాకు పనిచేయడం ఓ కొత్త అనుభూతనిని కలిగించిందని కెమెరామేన్ ఐ అండ్రూ తెలిపారు.
ఓ ట్రూ లీడర్ లా హరిత ఈ సినిమాను తెరకెక్కించారని నటులు అమీన్, అనురాగ్ చింటూ, అప్పాజీ అంబరీష్, షానీ, సాహితీ దాసరి తదితరులు చెప్పారు. ఆమె వన్ మ్యాన్ ఆర్మీలా ఈ సినిమా కోసం కృషి చేశారని సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ అన్నారు. ఈ సినిమాకు పెయిడ్ ప్రీమియర్స్ ను ఏర్పాటు చేశామని, అడ్వన్స్ బుకింగ్స్ ఆశాజనకంగా ఉన్నాయని నిర్మాత అభి తెలిపారు. ఈ కార్యక్రమంలో సోహైల్, నిర్మాత బెక్కెం వేణు అతిథులుగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.