Kalki 2898: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించిన విజువల్ వండర్ ‘కల్కి 2898ఎడి’ జపాన్ రిలీజ్ కి రంగం సిద్ధమైంది. ప్రభాస్ కెరీర్ లో రెండో 1000 కోట్ల సినిమాగా చేరిన ఈ సినిమాలో అమితాబ్, దీపిక పదుకొనె, కమల్ హాసన్ నటించారు. జపాన్ లో ఇండియన్ మూవీస్ కి ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను జనవరి 3న రిలీజ్ చేయబోతున్నారు.
Kalki 2898: ఈ సందర్భంగా ఆక్కడి ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమను చూసి దర్శకుడు నాగ్ అశ్విన్ ఆశ్చర్యపోతున్నాడు.సినిమా గురించి తనకు వచ్చిన లెటర్స్ ను చుట్టూ పేర్చి ఫోటో దిగి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత జపాన్ లో విడుదల అవుతున్న సినిమా ‘కల్కి’. ఇప్పటికే ఈ సినిమాపై సూపర్ బజ్ ఉంది.
ఇది కూడా చదవండి: Viral News: నాకు విడాకులు వచ్చాయోచ్.. ఓ భర్త కిర్రాక్ పార్టీ.. నోళ్లు వెళ్ళబెట్టి చూసిన జనం!
Kalki 2898: ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అక్కడ రిలీజ్ పై ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ‘కల్కి2’ని 2025 ఏప్రిల్, మేలో మొదలు పెట్టి 2026 ద్వితీయార్థంలో కానీ, 2027 ఆరంభంలో కానీ రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు వైజయంతీ మూవీస్ అధినేతలు. మరి దీనికి ముందు జపాన్ లో ‘కల్కి2898ఎడి’ హంగామా ఎలా ఉంటుందో చూద్దాం.

