Kalki 2898 AD

Kalki 2898 AD: ‘కల్కి 2898 ఏడి’ సీక్వెల్‌.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్!

Kalki 2898 AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడి’ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం అద్భుతమైన గ్రాఫిక్స్, ప్రభాస్‌ భైరవ పాత్రతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.

ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని చిత్ర యూనిట్ గతంలో ప్రకటించగా, అభిమానులు ‘కల్కి 2’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ ‘కల్కి 2’పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో సీక్వెల్ రిలీజ్‌కు 3-4 గ్రహాలు అనుకూలించాలని చెప్పిన ఆయన, ఇప్పుడు ఏకంగా 7-8 గ్రహాలు కలవాల్సిన అవసరం ఉందని సెటైరికల్‌గా అన్నారు.

Also Read: Gaddar Film Awards: జూన్‌ 14న గద్దర్‌ సినిమా అవార్డుల వేడుక

Kalki 2898 AD: ప్రభాస్ ప్రస్తుతం కమిట్ అయిన ఇతర చిత్రాలను పూర్తి చేయాల్సి ఉండటంతో ‘కల్కి 2’ ఆలస్యం కావచ్చని సూచనప్రాయంగా తెలిపారు. ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. ‘కల్కి 2’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *