Kakani Govardhan Reddy: వైసీపీ లీడర్స్ అధికారం పోయాక చాల వాయిలైంట్‌గా మారిపోతున్నారు.
కూటమి నేతలపై వైసీపీ క్యాడర్ మాటల తూటలు పేలుస్తుంది. పోలీసు అధికారులను పదే పదే టార్గెట్ చేస్తూ మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాణి, సోమిరెడ్డిల మధ్య నీళ్లు పోసిన పెట్రోల్ లాగా మండుతుంది. నిత్యం సర్వేపల్లిలో వైసీపీ, టీడీపీల మధ్య వివాదాలు భగ్గుమంటున్నాయి. ఇటీవల కాకాణి ముఖ్య అనుచరుడు, మాజీ జెడ్పిటిసి వెంకట శేషయ్యను టైమ్ చూసి సోమిరెడ్డి చావు దెబ్బకొట్టి, ఇరవై రోజులు జైళ్లో పెట్టించడంపై కాకాణి గోవర్ధన్ రెడ్డి పెద్ద దుమారం చేశారు. సోమిరెడ్డి కోట్టిన దెబ్బకు వైసీపీ క్యాడర్‌లో భయం మొదలైందని టీడీపీ లీడర్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారంటా… దీంతో వైసీపీ నేతల్లో ధైర్యం నింపేందుకు కాకాణి రఫ్ అండ్ టఫ్‌గా మారిపోయారంటా.
నెల్లూరు జిల్లా వెంకటాచలంలో వైసీపీకి లీడర్ వెంకటశేషయ్యపై మహిళ పెట్టిన కేసులో అరెస్ట్ జరగడం, ఇరవై రోజుల జైళ్లో ఉండటం, ఆ టైమ్‌లో పోలీస్ స్టేషన్, కోర్టు, జైల్ వద్ద మాజీ మంత్రి కాకాణి
చేసిన హంగామా వైసీపీ క్యాడర్‌లో కొంత ధైర్యం నింపింది. ఆసమయంలోనే తన నోటి పవర్‌తో కాకాణి పోలీసు అధికారులపై విరుచుకుపడ్డారు. టీడీపీ నేతలు చెప్పినట్టు చేస్తున్నారు. తమపై అక్రమ కేసులు పెడుతున్నారు. మిమ్మల్లి వదలిపెట్టాం. మీ ఖాకీ డ్రెస్ ఊడబెరికి, మీ ఉద్యోగాలు తీయిస్తాం. తమ వైసీపీ లీడర్స్‌ని వేధించే పోలీసు అధికారుల కుటుంబాలను అల్లాడిస్తాం.
Kakani Govardhan Reddy: జగన్ మళ్లీ సీఎం అవుతారు మీ అంతు చూస్తాం అంటు కాకాణి తిట్ల దండకంతో చెలరేగిపోవడం మొదలు పెట్టారు. కొందరు పోలీసులపై ప్రైవేటు కేసులు కూడ వేయడం ప్రారంభించారంటా కాకాణి. రెండు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన కాకాణి గోవర్దన్ రెడ్డి పవర్ పోయాక, ఫుల్ టైమ్ పోలిటిషియన్‌గా మారిపోయారు. వైసీపీ క్యాడర్‌ని కాపాడుకునేందుకే పోలీసులపై ఇంత ఘోరమైన భాష వాడుతున్నారని పార్టీ సమర్దించుకుంటుంది. కానీ ప్రభుత్వంలో పని చేసి, ఎమ్మెల్యేగా ఉన్న అనుభవం ఉండి కూడ, ఇంత నీచంగా పోలీసులను, అధికారులను తిడితే ఎలాగ అనే విమర్సలు కూడ ఎక్కవగా వైరల్ అవుతున్నాయి.
మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి తన రాజకీయ ప్రత్యర్ది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై పోరాడలేక,
ఫ్రస్టేషన్‌లో పోలీసులను తిడుతున్నారని టీడీపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. సోమిరెడ్డి చేతిలో ఓటమి తరువాత కాకాణి ఘోరమైన అవమానభారంతో రగిలిపోతున్నారు. ఇంక మంత్రిగా అధికారంలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారంటా… అందుకే పోలీసులను బెదిరిస్తున్నారని సోమిరెడ్డి అనచరులు విమర్శలు చేస్తున్నారు.
నాకు సర్వేపల్లిలో ఎదురులేదు,తిరగులేదని రెచ్చిపోయి చివరికి సోమిరెడ్డి చేతిలో కాకాణి ఓడిపోయారు. కాకాణి గావు కేకలు పెడుతు, రెవెన్యూ అధికారులను, పోలీసులను బెదిరిస్తు, చేస్తున్నారని సోమిరెడ్డి అనచరులు టీజింగ్ చేస్తున్నారు. పాపం కాకాణి పరిస్దితి ఇప్పుడే ఇలాగ ఉంటే, రేపో, ఎల్లుండో తమ నాయకుడు సోమిరెడ్డి మంత్రి అయితే జింతక్ చితచిత అంటు వెటకారపు విమర్సలతో కాకాణిని ఇంక కాలిస్తున్నారంటా సోమిరెడ్డి అనచరులు.
Kakani Govardhan Reddy: వైసీపీ అధినేత జగన్ దగ్గర కాకాణి గోవర్దన్ రెడ్డికి గుడ్ విల్ చాలా ఉంది. నెల్లూరు జిల్లాలో కాకాణి అయితేనే కరెక్ట్‌గా టీడీపీకి కౌంటర్ ఇస్తారనే నమ్మకంతో నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలు ఆయనకు ఇచ్చారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ మాజీలు అంత కూడ తమ కష్టాలు, బాధలు, కేసుల గురించి, తమ నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు పెట్టే బాధల గురించి కాకాణి దగ్గర చెప్పుకుంటు సలహలు తీసుకుంటున్నారంటా… తాజాగా కావలిలో వైసీపీ, టీడీపీ లీడర్స్ మధ్య జరిగిన గోడవలు, కేసుల వల్ల అక్కడకు వెళ్లిన కాకాణి మాటలతో మంటలు రేపి వచ్చారు.
కావలి వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కూమార్ రెడ్డి ఇప్పటికే వైసీపీకి క్యాడర్‌ని ఫైట్‌కి రెడీ చేశారు. కేసులు, అరెస్ట్‌లు, కోర్టుల కోసం వ్యవస్థని ఏర్పాటు చేసిన ప్రతాప్ కూమార్ రెడ్డి, బెంగళూరులో కూర్చోని కూడ కావలి వైసీపీ క్యాడర్‌కు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారంటా. అన్న కావలి రావాలి. పోలీసులు వన్ సైడ్‌గా కావలిలో కేసులు పెడుతున్నారని ప్రతాప్ రెడ్డి కాకాణి ని పిలిచారంటా.
నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కావలికి పోయిన కాకాణి గోవర్దన్ రెడ్డి పోలీసులకు వార్నింగ్‌లు ఇవ్వడంతో ఒళ్లు మండిపోయిన పోలీసులు కేసులు కూడ పెట్టారంటా… టీడీపీ చెప్పినట్టు చేసే పోలీసు అధికారుల ఉద్యోగాలు ఉండవు. మీ గుడ్డలు ఊడదీసి మీ కుటుంబాలను ఏడిపిస్తాం.
ఏడు సముద్రల అవతల ఉన్న మా జగన్ సీఎం కాగానే ఇప్పుడు వైసీపీ క్యాడర్‌ని వేధించే పోలీసులను జైళ్లలో వేస్తాం అంటు కాకాణి చేసిన విమర్సలతో పోలీసు శాఖకు ఆయన టార్గెట్‌గా మారిపోయారంటా… అయిన కాకాణి నేను తగ్గేది లేదు.నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను. అరెస్ట్‌లకు నేను రెడీ. జైలు పోడానికి కూడ యావర్ రెడీ అంటు వరుస ప్రెస్ మీట్‌లు పెట్టి కూటమి నేతలపై రెచ్చిపోతున్నారంటా. చూడాలి రండి అరెస్ట్ చేయండి అంటు రెచ్చగోట్టే రాజకీయం చేస్తున్న కాకాణి గోవర్దన్ రెడ్డి రానున్న రోజుల్లో పోలీసుల కేసులు,
అరెస్ట్‌ల దెబ్బకు సైలెంటు అవుతారా లేక ఇంక వాయిలెంట్‌గా మారుతారా లేదా అనేది వేచి చూడాలి.