KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు సృష్టించారు. తాజాగా, హిల్ట్ పాలసీ (HILT Policy) విషయంలో ఆయన హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భారీ భూ కేటాయింపు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నారు.
ఈ పిటిషన్‌లో కేఏ పాల్ గారు 9,292 ఎకరాల భూ కేటాయింపు అక్రమమని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ లేదా ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా పూర్తి స్థాయి విచారణ జరిపించాలని కోరారు. అంతేకాకుండా, ఈ భూ కేటాయింపులకు సంబంధించిన పాత రికార్డులన్నింటినీ వెంటనే సీజ్ చేసి, నిపుణులతో ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలని కూడా హైకోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై ఎలా స్పందిస్తుందో, హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే ఉత్కంఠ నెలకొంది.

