Ka Paul: సినీ హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యల పరంపర కొనసాగుతున్నది. పలువురు నటులే కాకుండా, సామాన్య ప్రజానీకం కూడా వివిధ సోషల్ మీడియా వేదికలపై స్పందిస్తున్నారు. కొందరు శివాజీ వ్యాఖ్యలను స్పందిస్తుండగా, మరికొందరు ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. శివాజీ వ్యాఖ్యలను ప్రముఖ సీనియర్ నటుడు ప్రకాశ్‌రాజ్, నటి, యాంకర్ అనసూయ ఖండించారు.
Ka Paul: తాజాగా ప్రజాశాంతి అధినేత కేఏ పాల్ కూడా శివాజీ వ్యాఖ్యలపై స్పందించారు. శివాజీ తాను చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ ఎదుట హాజరై క్షమాపణ చెప్పారని తెలిపారు. కానీ, శివాజీ ఎవరినీ కించపరచాలనే ఉద్దేశంతో అలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పుకొచ్చారు. అందరూ మంచిగుండాలనే సదుద్దేశంతో ఆయన ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని చెప్పారు.
Ka Paul: ఇదే సమయంలో నటడు నందమూరి బాలకృష్ణ గతంలో చేసిన వ్యాఖ్యల పట్ల కేఏ పాల్ స్పందించారు. ఓ ఈవెంట్‌లో గతంలో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ మహిళలకు కడుపు చేయాలి.. అన్న మాటలను గుర్తుచేశారు. మరి ఆ సమయంలో బాలకృష్ణపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. టీడీపీ, బీజేపీ పార్టీల మద్దతు వల్లే బాలయ్యపై ఆనాడు చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.
