KA Paul: కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్డిల పార్టీ అని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీసీలకు న్యాయం చేస్తున్నామని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ, బీసీ నాయకుడు హన్మంతరావును ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎందుకు ప్రకటించలేదని కేఏ పాల్ ప్రశ్నించారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ 12 మంది రెడ్డిలను ముఖ్యమంత్రులుగా చేసిందని, బీసీల గురించి ఒక్కసారైనా ఆలోచించిందా అని ఆయన నిలదీశారు. గతంలో బీసీల గురించి పీవీ నరసింహారావు, వైఎస్ రాజశేఖరరెడ్డి వంటివారు ఆలోచించినా, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎప్పుడూ రెడ్డి సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తుందని పాల్ అన్నారు.
కేఏ పాల్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తున్నారని, బీసీల గురించి కాంగ్రెస్ పార్టీ నిజంగా ఆలోచించట్లేదని ఆయన అన్నారు.
ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. ముఖ్యంగా తెలంగాణలో ఇప్పుడు బీసీల ఓటు బ్యాంకు కీలకంగా మారింది. ఇలాంటి సమయంలో కేఏ పాల్ చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టే అవకాశం ఉంది.

