K Sanjay Murthy

K Sanjay Murthy: కాగ్ చీఫ్ గా తెలుగు అధికారి.. ఆయన తండ్రి ఒకప్పటి ఎంపీ !

K Sanjay Murthy: భారతదేశ తదుపరి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌గా 1989-బ్యాచ్ హిమాచల్ ప్రదేశ్ కేడర్ IAS అధికారి కె. సంజయ్ మూర్తి నియమితులయ్యారు. నవంబర్ 20న పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత కంప్ట్రోలర్ అండ్  ఆడిటర్ జనరల్‌ గిరీష్ చంద్ర ముర్ము స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్‌లో, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 148లోని క్లాజ్ (1) ద్వారా లభించిన అధికారం ద్వారా  కె. సంజయ్ మూర్తిని కంప్ట్రోలర్ అండ్  ఆడిటర్ జనరల్‌గా నియమించడం పట్ల రాష్ట్రపతి సంతోషిస్తున్నట్లు పేర్కొంది. మూర్తి ప్రస్తుతం విద్యా మంత్రిత్వ శాఖలో ఉన్నత విద్యా శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Sabarimala: వాహనాల్లో శబరిమల వెళ్లే యాత్రీకులకు శుభవార్త

K Sanjay Murthy: అతను అక్టోబర్ 1, 2021 నుండి ఈ పదవిలో ఉన్నారు.  ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఆయన పదవీకాలంలో  పేపర్ లీక్ సంఘటనలు చోటుచేసుకున్నాయి. ముర్ము భారతదే కంప్ట్రోలర్& ఆడిటర్ జనరల్‌గా ఆగస్ట్ 8, 2020న పదవీ బాధ్యతలు స్వీకరించారు. ముర్ము పదవీకాలంలో NDA ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ హైవే ప్రోగ్రామ్, భారతమాల ప్రాజెక్ట్, ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన ఆడిట్‌తో సహా అనేక కీలక ఆడిట్ రిపోర్ట్స్ ను చూశారు. 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *