Jyothi Surekha: ప్రపంచ ఇండోర్ ఆర్చరీ సిరీస్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ స్వర్ణంతో మెరిసింది. కాంపౌండ్ మహిళల వ్యక్తిగత ఫైనల్లో ఈ విజయవాడ ఆర్చర్ 147-145 తేడాతో బెల్జియం ఆర్చర్ మరీటాపై విజయం సాధించింది. అంతకుముందు సెమీస్ లోనూ గట్టి పోటీ ఎదుర్కొన్న వెన్నం జ్యోతి.. షూటాఫ్ లో విజయంతో ఫైనల్ చేరింది. టఫ్ గా సాగిన సెమీస్ మ్యాచ్ లో జ్యోతి ఎక్కడా తలడపలేదు. ఇటలీ ఆర్చర్ ఎలీసా ఎంతగా పోటీనిచ్చినా..గురి తప్పలేదు. పోటాపోటీగా స్కోర్లు సాధించడంతో సెమీస్ మ్యాచ్ షూటాఫ్ అవసరమైంది. షూటాఫ్ లో విజయంతో ఫైనల్లో చేరిన జ్యోతి ..ఫైనల్లోనూ అదే జోరును ప్రదర్శించింది. పట్టువదలకుండా ..గురి తప్పకుండా సర్ణ ప్రదర్శనతో అదరగొట్టింది.
ఇది కూడా చదవండి: AUS vs IND: పెర్త్ టెస్టుకు బుమ్రా సారథ్యం..వన్ డౌన్ లో రాహుల్..