Junior Movie Review: ‘జూనియర్’ సినిమాతో కిరీటి రెడ్డి హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. స్టైలిష్ లుక్, డైలాగ్ డెలివరీ, ముఖ్యంగా డాన్స్‌లో అదరగొట్టాడు. శ్రీలీలతో స్పెషల్ సాంగ్‌లో అతని స్టెప్స్ ఆకట్టుకుంటాయి. రవిచంద్రన్, రావు రమేష్ పాత్రలు, సెకండ్ హాఫ్‌లోని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ సినిమాకు బలం. అయితే, కథలో కొత్తదనం లేకపోవడం, ఫస్ట్ హాఫ్‌లో బోరింగ్ సన్నివేశాలు మైనస్. జెనీలియా పాత్ర సరిగా ఉపయోగించుకోలేదు. రొటీన్ స్క్రీన్‌ప్లే, బలహీనమైన విలన్ ట్రాక్ కథనాన్ని డల్ చేశాయి. కిరీటి టాలెంట్ ఆకట్టుకున్నా, కంటెంట్ మాత్రం నిరాశపరిచింది.

