Junior

Junior: తెలుగు ప్రేక్షకులకు జూనియర్ హీరో హృదయపూర్వక కృతజ్ఞతలు!

Junior: గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి తన తొలి సినిమా జూనియర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి వస్తున్న అభిమానం, ప్రేమపై ఎక్స్‌లో స్పందించారు. తెలుగు, కన్నడ ప్రేక్షకులకు నమస్కరిస్తూ, సినిమాను నిజాయితీతో తీశామని, అభిమానుల ఆదరణ తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని చెప్పారు. ఈ సినిమా కోసం రాధాకృష్ణ దర్శకత్వంలో, శ్రీలీల, జెనీలియా వంటి తారలతో కలిసి ఎంతో కష్టపడ్డామని తెలిపారు.

Also Read: Most Popular Film Stars: భారత సినిమా స్టార్స్ టాప్ లిస్ట్! నెంబర్ 1 ఎవరు?

ప్రేక్షకుల ప్రేమ, ఆశీస్సులు ఎల్లప్పుడూ తమకు తోడుగా ఉండాలని ఆకాంక్షించారు. జూనియర్‌లో కిరీటి నటన, డాన్స్‌లకు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ చిత్రం కన్నడ, తెలుగు భాషల్లో విడుదలై, ప్రేక్షకులను అలరిస్తోంది. మంచి కంటెంట్‌తో మరిన్ని చిత్రాలు అందించేందుకు కిరీటి బృందం సన్నద్ధమవుతోంది. మరి జూనియర్ తో మెప్పించిన కిరీటి తన సినిమాలతో ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *