Judgement: కన్నకూతురునే కడతేర్చన తల్లికి సూర్యాపేట జిల్లా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. అదే జిల్లా మోతె మండలంలోని మేకపాటి తండాలో 2021లో జరిగిన ఈ ఘటనపై తాజాగా కోర్టు తీర్పు వచ్చింది. మూఢనమ్మకాల పిచ్చితో కన్నబిడ్డనే బలిచ్చిన ఆ తల్లి ఘటన అప్పుడు సంచలనంగా మారింది. దీనిపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఇంకా మూఢనమ్మకాల ముసుగులో జనం మగ్గిపోతున్నారని చర్చ జరిగింది. ఈ మేరకు కేసు విచారణ అనంతరం కోర్టు ఉరిశిక్ష విధించింది. ఇదే సరైన శిక్ష అని భావించింది.
Judgement: మేకపాటితండాకు చెందిన బానోతు భారతి మొదటి భర్తతో విడాకులు తీసుకున్నది. ఆ తర్వాత తన చిన్ననాటి స్నేహితుడైన కృష్ణను రెండో వివాహం చేసుకున్నది. ఈ పెళ్లికి ముందు నుంచి ఆమెకు అనారోగ్యం దరిచేరింది. ఆసుపత్రులకు తిరిగింది. నాటు వైద్యులను సంప్రదించింది. అయినా ఆమె ఆరోగ్యంలో మార్పు రాలేదు.
Judgement: ఇదే సందర్భంలో ఓ జ్యోతిష్యుడిని ఆశ్రయించింది. నయం చేస్తానని చెప్పడంతో అతని మాటలు నమ్మింది. ఆయన చెప్పిన ప్రకారం రకరకాల పూజలు చేయసాగింది. ఒక పాప పుట్టిన ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇదే క్రమంలో 2021 ఏప్రిల్ 15న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పూజలు చేసింది.
Judgement: ఈ సమయంలో పూజలు చేస్తూ తన 7 నెలల బిడ్డను గొంతు, నాలుక కోసి బలిచ్చింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె భర్త కృష్ణ ఫిర్యాదుతో నిందితురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఆమె కొన్నాళ్లకు బెయిల్‌పై విడుదలైంది.
Judgement: కొన్నిరోజుల అనంతరం గ్రామ పెద్దల సూచన మేరకు ఆమెను భర్త కాపురానికి తీసుకెళ్లాడు. ఈ దశలో తనపై కేసు పెట్టాడనే కోపంతో రగిలిపోయిన భారతి ఇంట్లో నిద్రిస్తున్న భర్తపై ఇనుపరాడ్డుతో కొట్టి చంపేందుకు ప్రయత్నించింది. 2023లో బలిపేరుతో జరిగిన ఈ ఘటన కూడా ఆ రోజుల్లో సంచలనంగా మారింది. మూఢనమ్మకాల పిచ్చితో కన్నబిడ్డనే హతమార్చిన ఆ కఠినాత్మురాలికి ఉరే సరి అని శిక్ష విధిస్తూ సూర్యాపేట ఒకటో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి డాక్టర్ ఎం శ్యాంశ్రీ తీర్పునిచ్చింది.