jubliee hills: తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎప్పుడెప్పుడా అని ఇటు రాజకీయ పార్టీలతో పాటు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆసక్తిగా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అధికార, ప్రతిపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలతో మోహరించాయి. అసెంబ్లీ, లోక్‌సభ సాధారణ ఎన్నికల అనంతరం జరిగే మొదటి ఉప ఎన్నిక కావడంతో అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి. దీంతో ఈ ఉత్కంఠకు తెరపడినట్టయింది. త్వరలో బీహార్ ఉప ఎన్నికలతోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా జరుగుతుందని తేలిపోయింది.
jubliee hills: జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీతో పాటు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావించాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా అభ్యర్థినే ప్రకటించింది. మాగంటి గోపీనాథ్ సతీమణిని అభ్యర్థిగా ప్రకటించింది. కాంగ్రెస్ మాత్రం పోటీ ఎక్కువగా ఉండటంతో మీనమేషాలు లెక్కిస్తున్నది.
jubliee hills: ఈ నేపథ్యంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. మూడు దశల్లో అక్కడ ఎన్నికలు నిర్వహించాలనే ప్రణాళికతో కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నది. నవంబర్ తొలి వారంలో తొలి దశ ఎన్నికలు ఉండనున్నట్టు సమాచారం. అక్టోబర్ మొదటి వారంలో ఆ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటిస్తుందని తెలిసింది.
jubliee hills: దీంతో జూబ్లీహిల్స్ తో దేశంలోని అసెంబ్లీ, లోక్‌సభ ఉప ఎన్నికలకు కూడా అక్టోబర్ తొలి వారంలోనే ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉన్నది. బీహార్ అసెంబ్లీ కాలపరిమితి నవంబర్ 22లోగా ముగుస్తుంది. ఆ లోగా ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని ఈసీ భావిస్తున్నది. ఈ మేరకు సెప్టెంబర్ 30న బీహార్ ఎన్నికల తుది జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నది.