jubliee hills By elections 2025: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరు ప్రతిష్టాత్మకంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తికావస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలై పుంజుకోవాలని చూస్తున్నది. ఆ రెండు పార్టీలను మించి వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్నది. ఈ నేపథ్యంలో ఈ మూడు పార్టీల నడుమ ప్రధాన పోటీ ఉన్నా.. బీజేపీది మూడో స్థానమేనని రాజకీయ విశ్లేషకులు, సెఫాలజిస్టులు జోస్యం చెప్తున్నారు. దీంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల నడుమే ప్రధాన పోటీ నెలకొని ఉన్నదని తేలింది.
jubliee hills By elections 2025: ఇప్పటి వరకూ నామినేషన్లు, ఉపసంహరణ, ఓటర్ల జాబితాల పరిశీలన, చేరికల పర్వం, గ్రూపులు, కాలనీల అసోసియేషన్లును కలిసే పనుల్లో అన్ని పార్టీలు బిజీగా గడిపాయి. ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆయా పనుల్లో తలమునకలై ఉన్నాయి. అయితే అక్టోబర్ 31న శుక్రవారంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఒక్క జూబ్లీహిల్స్ ప్రజలతోపాటు రాష్ట్రమంతా అటెన్షన్ సీన్‌లోకి వెళ్లిపోయింది.
jubliee hills By elections 2025: శుక్రవారం రోజే అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రోడ్‌షోలతో అలజడి రేపారు. బీఆర్ఎస్ పార్టీ షేక్‌పేట నాలా వద్ద నిర్వహించిన ఆ డివిజన్ రోడ్‌షోలో కేటీఆర్, ఆ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ ప్రసంగించగా, రహ్మత్‌నగర్ డివిజన్‌లో నిర్వహించిన కాంగ్రెస్ రోడ్‌షోలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆ పార్టీ అభ్యర్థి నవీన్‌యాదవ్ ప్రసంగించారు.
jubliee hills By elections 2025: ఈ సమయంలో ఇరు పార్టీల నేతలు తమతమ ప్రచార దండాలను బయటకు తీశారు. బీఆర్ఎస్‌కు ఓటేస్తే తామిచ్చే పథకాలకు మీరు దూరమవుతారంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఓటర్లను హెచ్చరించారు. సన్నబియ్యం, ఉచిత కరెంట్, ఉచిత బస్సు ప్రయాణం తదితర పథకాలను మీరంతా దూరమవుతారంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఒకింత హెచ్చరిస్తూనే మాట్లాడారు.
jubliee hills By elections 2025: కాంగ్రెస్‌కు ఓటేస్తే ప్రజలకు ఇచ్చిన హామీలు మరుగున పడతాయని, పింఛన్ 4 వేలు రావని, మహిళలకు 2,500 హామీ అటకెక్కుతుందని, ఇచ్చిన హామీలను ఈ రెండేండ్లలో అమలు చేయలేదని, ఇక్కడ కూడా కాంగ్రెస్ గెలిస్తే అసలే అమలు చేయదని, బీఆర్ఎస్‌కు ఓటేస్తే గల్లాపట్టి అమలు చేయిస్తామని కేటీఆర్ ఓటర్లను కోరారు.
jubliee hills By elections 2025: షేక్‌పేట, రహ్మత్‌నగర్ డివిజన్లలో మొదలైన రోడ్‌షోలు వరుసగా ఉండనున్నాయి. ఇక మిగిలింది 10 రోజులే కావడంతో రోడ్‌షోలతో ఓటర్లను హోరెత్తించనున్నారు. ఇటు కేటీఆర్, అటు సీఎం రేవంత్‌రెడ్డి సహా పలువురు కీలక నేతలు ప్రచార సభల్లో పాల్గొంటారని తెలుస్తున్నది. ఇప్పటికే కేటీఆర్ వరుస రోడ్‌షోల షెడ్యూల్‌ను ఆ పార్టీ ప్రకటించింది.
jubliee hills By elections 2025: సీఎం రేవంత్‌రెడ్డి మరో మూడు, నాలుగు రోడ్‌షోలలో పాల్గొనే అవకాశం ఉంటుందని సమాచారం. రేవంత్, ప్రియాంక, ఖర్గే లాంటి నేతలు వచ్చే అవకాశం లేకపోవచ్చు. ఒకరిద్దరు కీలక నేతలు వచ్చే అవకాశం ఉన్నది. అదే విధంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒకరోజు రోడ్‌షో సభలో పాల్గొంటారని తెలుస్తున్నది.

