Jubilee Hills:

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌పై బెట్టింగుల జోరు!

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ పోలింగ్ కు స‌మ‌యం దగ్గర పడుతున్నకొద్దీ.. అందరి దృష్టీ ఫ‌లితాల‌పై ఆసక్తి నెల‌కొన్న‌ది. ఇదే స‌మ‌యంలో బెట్టింగ్ రాయుళ్లు రంగంలోకి దిగుతున్నారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ప్ర‌జ‌లు కూడా ఆస‌క్తి పెరిగింది. ఈ ఉప ఎన్నికపై బెట్టింగ్ కాసేందుకు సంప్రదింపులు జరుపుతున్న‌ట్టు స‌మాచారం. హైదరాబాద్ లోని కొంద‌రు బెట్టింగ్ రాయుళ్ల‌కు ఫోన్లు చేస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌ధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పేనే పెద్దమొత్తంలో బెట్టింగ్ పెడుతున్నట్లు తెలుస్తున్న‌ది.

కాంగ్రెస్‌ రెండేండ్ల‌ పాలనకు రిఫరెండం
Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా సాగుతోంది. పోటీ ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా ఉన్నట్లు అంచ‌నాలు తెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు పార్టీల కీల‌క నేత‌లంతా జూబ్లీహిల్స్ పైనే ఫోకస్ చేశారు. ఈ పరిస్థితుల్లోనే బెట్టింగ్ అంశం తెరపైకి వచ్చింది. 2023 త‌ర్వాత‌.. తెలంగాణలో జ‌రుగుతున్న కీలక ఉప ఎన్నిక కావ‌డంతోపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల‌న‌కు రిఫరెండంగా కూడా ఈ ఉప పోరు మారడంతో బెట్టింగుల‌కు అవ‌కాశం ఏర్ప‌డింద‌న్న చ‌ర్చ సాగుతోంది. ఏపీలోని పలు ప్రాంతాలు స‌హా బెంగ‌ళూరు నుంచి హైదరాబాద్ లోని బెట్టింగ్ రాయుళ్లకు ఫోన్లు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌ముఖ జాతీయ మీడియాలోనూ జూబ్లీహిల్స్‌పై బెట్టింగులు జ‌రుగుతున్నటుల క‌థ‌నాలు రావడం గ‌మ‌నార్హం.

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బెట్టింగులకు ప్రధానంగా రెండు కార‌ణాలు ఉన్నాయ‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. స‌హ‌జంగానే ఏపీ, తెలంగాణ రాజ‌కీయాల్లో ఎప్పుడూ వేడి కొన‌సాగుతుంది. దీంతో స‌హ‌జంగానే ఏపీలోని ఉభ‌య గోదావ‌రి జిల్లాలు స‌హా.. అనంత‌పురం, క‌డ‌ప‌లోని రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులు బెట్టింగుల‌కు దిగుతున్నారు. మరోవైపు బెంగ‌ళూరుకు చెందిన వ్యాపారులు కూడా ఇదే బాట ప‌ట్టారు. కొన్ని కీల‌క పార్టీలు చాలా వ్యూహాత్మ‌కంగా త‌మ గ్రాఫ్‌ను పెంచుకునేందుకు కూడా బెట్టింగుల‌ను ప్రోత్స‌హించిన ప‌రిస్థితి గ‌త ఎన్నిక‌ల్లో క‌నిపించింది. అంటే.. త‌మ పార్టీ గెలుస్తుంద‌ని ఎక్కువ మంది బెట్టింగ్ క‌ట్టిన‌ట్టుగా ప‌రోక్షంగా ప్ర‌చారం చేసుకుంటారు. త‌ద్వారా ఓటరు ఆలోచ‌న‌ను ప్ర‌భావితం చేస్తారు. ఇది త‌మ‌కు లాభిస్తుంద‌న్న ఆశ‌తో చివ‌రి నిముషంలో ఫ‌లితాల‌ను త‌మ‌కు అనుకూలంగా ఇస్తుంద‌న్న ఆశ‌తో ఉంటార‌న్న‌ది మరో కారణం.

Jubilee Hills: తాజాగా జూబ్లీహిల్స్ విష‌యంలో ఈ రెండింట్లో ఏది జ‌రిగింద‌న్న‌ది చెప్ప‌లేక‌పోయినా.. ప్ర‌స్తుతం సీఎం రేవంత్ వ‌ర్సెస్ బీఆర్ ఎస్ అన్న‌ట్టుగా ఈ ఉప ఎన్నిక మారడంతో.. బెట్టింగుల‌కు అవ‌కాశం ఏర్ప‌డింద‌న్న చ‌ర్చ సాగుతోంది. ప్ర‌స్తుతం హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌, తార్నాక‌, మ‌ణికొండ‌, ఖైర‌తాబాద్‌ వేదికగా.. ముమ్మరంగా సాగుతోంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో గుస‌గుస‌లాడుకుంటున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *