Jubilee hills: ఫల్లించిన బుజ్జగింపులు.. అలకే ఎపిసోడ్ ఓవర్

Jubilee hills: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక టికెట్‌ ఇవ్వకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన మాజీ ఎంపీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ చివరికి పార్టీ నిర్ణయానికి తలొగ్గారు. కాంగ్రెస్‌ టికెట్‌ లభించకపోవడంతో అలిగిన అంజన్‌ను ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వివేక్ వెంకటస్వామి కలిసి బుజ్జగించారు.

దీని తర్వాత అంజన్ కుమార్ యాదవ్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం పని చేయాలని అంగీకరించినట్లు తెలిసింది. దీంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉపశమనం నెలకొంది.

పార్టీ పెద్దల బుజ్జగింపు ఫలించింది

శుక్రవారం అంజన్ కుమార్ యాదవ్ ఇంటికి ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ కలిసి వెళ్లి చర్చించారు. గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో, పార్టీ ఐక్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని అంజన్‌కు నాయకులు సూచించారు.

‘కాంగ్రెస్‌లో స్వేచ్ఛ ఉంది’ – మీనాక్షి నటరాజన్

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్‌లో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉందని తెలిపారు. అంజన్ కుమార్ యాదవ్‌కు త్వరలో పార్టీ తగిన గౌరవస్థానం కల్పిస్తుందని స్పష్టం చేశారు.

ఆమె మాట్లాడుతూ, “కాంగ్రెస్‌లో సమిష్టి నిర్ణయాలు ఉంటాయి. పార్టీకి ఏది మంచిదో, అదే నిర్ణయం తీసుకుంటాం. నాయకులంతా సమన్వయంతో పనిచేయాలి” అని వ్యాఖ్యానించారు.

పార్టీలో మళ్లీ ఐక్యత వాతావరణం

అంజన్ కుమార్ యాదవ్ సంతృప్తి వ్యక్తం చేయడంతో, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలపై కాంగ్రెస్‌ వర్గాల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. నవీన్ యాదవ్ అభ్యర్థిత్వంపై ఇప్పుడు ఎలాంటి అంతర్గత విభేదాలు లేకుండా, పార్టీ శ్రేణులు ఏకమై పనిచేయాలని నేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *