Jubilee hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం 40 మంది అభ్యర్థుల నామినేషన్లను అధికారులు స్క్రూటినీ చేశారు.బీఆర్‌ఎస్ జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీత షేక్‌పేట ఆర్వో కార్యాలయానికి హాజరై నామినేషన్ పరిశీలనలో పాల్గొన్నారు. నామినేషన్ అఫిడవిట్‌లో ఇచ్చిన వివరాలు సరైనవేనని మరో డిక్లరేషన్ సమర్పించనున్నట్లు సునీత తెలిపారు.
అధికారులు తెలిపిన ప్రకారం, నామినేషన్ల పరిశీలన రేపు కూడా కొనసాగనుంది. అన్ని అర్హతల పత్రాలు సమీక్షించిన అనంతరం తుది అర్హుల జాబితా ప్రకటించనున్నారు.