Jr.NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల మ్యాడ్ స్క్వేర్ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ముఖ్య అతిథిగా పాల్గొని, తన అభిమానులను ఆనందంలో ముంచెత్తేలా చాలా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ప్రత్యేకించి, “దేవర 2” సినిమాపై వస్తున్న గాసిప్స్‌కు ఫుల్‌స్టాప్ పెడుతూ, క్లారిటీ ఇచ్చారు. అలాగే తన తదుపరి ప్రాజెక్టుల గురించి కూడా వివరించారు.
“దేవర 2” ఖచ్చితంగా ఉంటుంది: ఎన్టీఆర్ క్లారిటీ
“దేవర” సినిమా గతేడాది దసరా సమయంలో భారీ అంచనాల మధ్య విడుదలై, మిక్స్‌డ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కానీ ఓటీటీలో విడుదలైన తర్వాత మాత్రం ట్రోలింగ్‌కు గురయ్యింది. ఈ నేపథ్యంలో “దేవర 2″పై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఎన్టీఆర్ మాత్రం “ఆ సినిమా ఖచ్చితంగా ఉంటుంది. మధ్యలో ప్రశాంత్ నీల్ సినిమా రావడం వల్ల చిన్న విరామం తీసుకున్నాం. దేవర 2 మీ అందరి కోసం ఉంటుంది” అంటూ స్పష్టత ఇచ్చారు.
“అదుర్స్ 2″పై సంకేతాలు.. కామెడీ చేయడం చాల కష్టం
వేదికపై మాట్లాడిన ఎన్టీఆర్, తన హాస్య టైమింగ్‌ను గుర్తు చేస్తూ “కామెడీ పలికించడం ఓ పెద్ద ఆర్ట్.. కామెడీ పలికించడం యాక్టర్ కి చాలా కష్టం. అందుకే నేను అదుర్స్-2 చేయడానికి ఆలోచిస్తున్నాను అని అన్నారు. VV వినాయక్ దర్శకత్వంలో వచ్చిన “అదుర్స్” సినిమా ఒకప్పటి బ్లాక్‌బస్టర్. దాని సీక్వెల్‌పై అభిమానులలో మంచి ఆసక్తి ఉంది.
ఇది కూడా చదవండి: Mahesh Babu: మరో ఇద్దరు చిన్నారులను బ్రతికించిన సూపర్ స్టార్!
ప్రశాంత్ నీల్, నెల్సన్ దిలీప్ కుమార్ సినిమాలు రాబోతున్నాయి
తాజాగా ఎన్టీఆర్ తన లైన్‌ప్‌లో మార్పులు జరిగాయని తెలిపారు. ప్రశాంత్ నీల్‌తో “NTR-Neel” ప్రాజెక్ట్ రూపొందుతోంది. అలాగే “జైలర్” ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో ఓ సినిమా చేయబోతున్నట్లు హింట్ ఇచ్చారు. నిర్మాత నాగవంశీతో కూడ మరో సినిమా చేయనున్నట్టు చెప్పారు.
“వంశీతో సినిమా మొదలెట్టే రోజు.. ఫ్యాన్స్ అందరిని హ్యాండిల్ చేయమని వదిలేస్తా. అతనే ఆ టార్చర్ పడతాడు!” అని నవ్వుతూ చెప్పారు.
“ఈ జన్మ అభిమానులకే అంకితం” – తారక్ ఎమోషనల్ స్పీచ్
ఈవెంట్‌లో ప్లే చేసిన AV వీడియో చూసిన తారక్ ఎమోషనల్‌య్యారు. “ఆ వీడియోలో మీ అందరి హృదయాలు ఉన్నాయి. నేను మీకోసమే కష్టపడుతుంటాను. మిమ్మల్ని ఆనందపెట్టడానికే బ్రతికుంటాను” అని అభిమానులపై తన ప్రేమను వ్యక్తం చేశారు. అంతేకాకుండా, “ఈ జన్మ అభిమానులకే అంకితం” అంటూ తన తండ్రి హరికృష్ణకు చెప్పిన మాటను గుర్తు చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ ఫుల్ స్పీచ్ ఇక్కడ చూడొచ్చు..