Jr NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రీసెంట్గా తన భారీ చిత్రం ‘దేవర’ జపాన్ రిలీజ్ కోసం అక్కడికి వెళ్లి సందడి చేసిన తారక్, ఇప్పుడు హైదరాబాద్‌కి తిరిగొచ్చాడు. ఈ క్రమంలో ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నట్టు తాజా సమాచారం. జపాన్ లో ‘దేవర’ రిలీజ్ వేడుకలు జరపనప్పటికీ, లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ ‘మ్యాడ్ స్క్వేర్’ విజయోత్సవ సంబరాలకు ఎన్టీఆర్ హాజరవుతున్నట్టు ఇప్పటికే కన్ఫర్మ్ అయింది. అయితే, ఈ సక్సెస్ మీట్ తర్వాత కొద్ది రోజుల గ్యాప్‌లోనే తన సోదరుడు కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్‌గా రానున్నట్టు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ విషయంపై బజ్ వచ్చినప్పటికీ, ఇప్పుడు ఈ న్యూస్ దాదాపు ఖరారైనట్టు టాక్ నడుస్తోంది. దీంతో నందమూరి అభిమానులకు ఒకేసారి రెండు ఈవెంట్స్‌తో డబుల్ ధమాకా ఖాయమని చెప్పవచ్చు. ఒకవైపు ‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్ సెలబ్రేషన్స్, మరోవైపు ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ప్రీరిలీజ్ ఈవెంట్‌తో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి పండగ వాతావరణం తప్పదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
