JP Nadda: వైరస్ కు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

JP Nadda: ఇతర దేశాల్లో అలజడి సృష్టిస్తున్న హ్యూమన్ మెటాన్యూమా వైరస్ (HMPV) గురించి కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పందించారు. భారతదేశంలో ఈ వైరస్ ఉనికి కనబడుతున్నప్పటికీ, ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

HMPV కొత్త వైరస్ కాదని, 2001లోనే దీనిని గుర్తించారని నిపుణులు చెబుతున్నారని తెలిపారు. ఈ వైరస్ పట్ల కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని నడ్డా పేర్కొన్నారు.

అలాగే, ఈ వైరస్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా పరిశీలన కొనసాగిస్తోందని, భారత్‌లో ICMR పరిస్థితిని సమీక్షిస్తోందని చెప్పారు. చైనా సహా పొరుగు దేశాల్లో పరిస్థితిని కేంద్రం నిశితంగా గమనిస్తోందని కూడా నడ్డా వెల్లడించారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Sama rammohan reddy: కవిత కొత్త పార్టీ ఆలోచనను స్వాగతిస్తున్నాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *