Jharan: థ్రిల్లర్ ఇష్టపడే ప్రేక్షకులకు జీ5 శుభవార్త అందించింది. ‘జరణ్’ అనే హారర్ థ్రిల్లర్ నవంబర్ 7 నుండి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాకి హృషికేష్ గుప్తా రచన, దర్శకత్వం వహించారు. అమృతా శుభాష్, అనితా డేట్ కెల్కర్ ప్రధాన పాత్రలు పోషించారు.
Also Read: Siva Re Release: చిరంజీవికి క్షమాపణలు చెప్పిన ఆర్జీవీ
స్పైన్ చిల్లింగ్ థ్రిల్లర్లు ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు జీ5 మరో ఆకర్షణీయ చిత్రాన్ని అందిస్తోంది. ఇటీవల ‘కిష్కిందపురి’ సినిమాతో విజయం సాధించిన జీ5, ఇప్పుడు ‘జరణ్’ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌ను నవంబర్ 7 నుండి స్ట్రీమింగ్ చేస్తోంది. హృషికేష్ గుప్తా రచన, దర్శకత్వంలో అనీజ్ బాజ్మి ప్రొడక్షన్స్, ఏ అండ్ ఎన్ సినిమాస్, ఏ3 ఈవెంట్స్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందింది. అమృతా శుభాష్, అనితా డేట్ కెల్కర్, కిషోర్ ఖడమ్, జ్యోతి మల్షే, అయానీ జోషి కీలక పాత్రలు పోషించారు. కథలో రాధ అనే మహిళ (అమృతా శుభాష్) కుమార్తెతో పూర్వీకుల ఇంటికి వెళ్తుంది. అక్కడ పాత బొమ్మ కారణంగా వింత అనుభవాలు, భయానక సంఘటనలు ఎదురవుతాయి. మానసిక ప్రవృత్తికి అద్దం పడుతూ, వాస్తవం-భ్రమల మధ్య తేడా చెరిగిపోయే సన్నివేశాలు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. అద్భుత నటన, భావోద్వేగ కథనంతో ‘జరణ్’ కట్టిపడేస్తుంది.

