Jeevan Reddy Vs Sanjay Kumar:

Jeevan Reddy Vs Sanjay Kumar: జ‌గిత్యాల ఇలాకాలో నువ్వా? నేనా?.. కాంగ్రెస్‌లో ముదిరిన జ‌గ‌డం

Jeevan Reddy Vs Sanjay Kumar:జ‌గిత్యాల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ కాంగ్రెస్ రాజ‌కీయాలు ముదిరి పాకాన‌ప‌డ్డాయి. అక్క‌డ మాజీ ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డి, తాజా ఎమ్మెల్యే సంజ‌య్‌కు మ‌ధ్య వివాదం కుంప‌టిలో రాజుకుంటూనే ఉన్న‌ది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సంజ‌య్‌.. ఆ త‌ర్వాత కొన్నాళ్ల‌కు కాంగ్రెస్ పార్టీలోకి పిరాయించారు. అప్ప‌టి నుంచి ఆయ‌న చేరిక నాటి నుంచి మాజీ ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డి జీర్ణించుకోలేక‌పోతున్నారు. ప‌లుమార్లు త‌న అస‌హ‌నాన్ని, అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కుతూనే ఉన్నారు. తాజాగా గాంధీభ‌వ‌న్ సంఘ‌ట‌న‌తో జీవ‌న్‌రెడ్డి మ‌రింత రెచ్చిపోయారు.

Jeevan Reddy Vs Sanjay Kumar:మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో స‌మ‌న్వ‌యం కోసం కాంగ్రెస్ పార్టీ జ‌గిత్యాల జిల్లా స‌మీక్ష స‌మావేశాన్ని గాంధీభ‌వ‌న్ వేదిక‌గా ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశంలో ముందుగానే జీవ‌న్‌రెడ్డి వెళ్లారు. ఆ మీటింగ్‌లో సాగునీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ అధ్య‌క్షుడు మ‌హేశ్‌కుమార్‌గౌడ్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఇదే స‌మావేశానికి ఎమ్మెల్యే సంజ‌య్ కూడా వ‌చ్చారు. ఆయ‌న వ‌చ్చీరాగానే జీవ‌న్‌రెడ్డి తీవ్ర అస‌హ‌నంతో ర‌గిలిపోయారు.

Jeevan Reddy Vs Sanjay Kumar:సంజ‌య్ రాక‌ను స‌హించని జీవ‌న్‌రెడ్డి గాంధీభ‌వ‌న్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయారు. స‌మావేశాన్ని బ‌హిష్క‌రించారు. బ‌య‌ట మీడియాతోనూ త‌న అసంతృప్తిని వెళ్ల‌బోసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను గాంధీభ‌వ‌న్‌లో జ‌రిగే కాంగ్రెస్ స‌మావేశానికి ఎలా పిలుస్తారు? అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. తాను ఏఐసీసీ అగ్ర‌నేత‌లు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ఖ‌ర్గేల‌కు, కాంగ్రెస్ పార్టీ మూల సూత్రాల‌కు వ్య‌తిరేకం కాద‌ని, వారి ఆశ‌యాల‌కు విరుద్ధంగా రాష్ట్రంలో జ‌రిగే వ్య‌వ‌హారాల‌కు తాను వ్య‌తిరేక‌మ‌ని తేల్చి చెప్పారు.

Jeevan Reddy Vs Sanjay Kumar:త‌ర‌చూ ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ఎమ్మెల్యే సంజ‌య్‌పై శివాలెత్తిపోయే జీవ‌న్‌రెడ్డి.. ఇటీవ‌లే మ‌రోసారి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే సంజ‌య్‌పై రెచ్చిపోయి మాట్లాడారు. వ‌చ్చే స్థానిక ఎన్నిక‌ల్లో నిజ‌మైన కాంగ్రెస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కే న్యాయం జ‌రుగుతుంద‌ని, అవ‌కాశవాదులు అడ్డ‌దారిలో వ‌స్తే అడ్డంగా తొక్కుతాం.. అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. తాజాగా గాంధీభ‌వ‌న్ మీటింగ్‌కు ఏకంగా ఎమ్మెల్యే రావ‌డంతో దానిని బ‌హిష్క‌రించి, త‌న అస‌మ్మ‌తిని మ‌రోసారి వ్య‌క్తంచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *