JEE Mains

JEE Mains: జనవరి 21 నుంచి జేఈఈ మెయిన్స్

JEE Mains: ఇంజనీరింగ్ చదవాలనుకునే విద్యార్థులకు కీలకమైన జేఈఈ మెయిన్స్ (JEE Mains) సెషన్-1 పరీక్షలు రేపటి (బుధవారం) నుండి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మన తెలంగాణ రాష్ట్రం నుండి ఈ ఏడాది దాదాపు 40 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారు.

విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్రవ్యాప్తంగా 14 ప్రధాన పట్టణాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ వంటి నగరాలతో పాటు మరికొన్ని ముఖ్య పట్టణాల్లో ఆన్‌లైన్ సెంటర్లను సిద్ధం చేశారు.

ఇది కూడా చదవండి: Akshay Kumar: అక్షయ్ కుమార్ కారుకు ప్రమాదం..

ఈ పరీక్షలు జనవరి 21, 22, 23, 24, 28, 29 తేదీల్లో జరుగుతాయి. వీటిలో మొదటి ఐదు రోజులు బీఈ, బీటెక్ కోర్సుల కోసం పరీక్షలు నిర్వహిస్తారు. చివరి రోజు అంటే జనవరి 29న మాత్రం బీఆర్క్, బీప్లానింగ్ విద్యార్థులకు పరీక్ష ఉంటుంది. ప్రతిరోజూ రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరుగుతాయి. ఉదయం సెషన్ 9 గంటల నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 3 గంటల నుండి 6 గంటల వరకు ఉంటుంది.

పరీక్షకు వెళ్లే విద్యార్థులు కొన్ని ముఖ్యమైన సూచనలు పాటించాలని అధికారులు తెలిపారు. పరీక్ష సమయానికి కనీసం అరగంట ముందే సెంటర్‌కు చేరుకోవాలి. అడ్మిట్ కార్డుతో పాటు తప్పనిసరిగా ఏదైనా ఒక అసలైన గుర్తింపు కార్డు (Original ID Card) వెంట తీసుకెళ్లాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *