JD Vance

JD Vance: భార్య మతంపై జెడి వాన్స్ మరోసారి కీలక వ్యాఖ్యలు

JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ తన భార్య ఉషా మతంపై చేసిన వ్యాఖ్యలు అమెరికాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు హిందూ సంఘాల్లో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. తన భార్య హిందువని, ఆమె ఒకరోజు క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తుందని ఆశిస్తున్నట్లు వాన్స్ చెప్పడంతో వివాదం చెలరేగింది.

మిస్సిస్సిప్పి రాష్ట్రంలోని ఆక్స్‌ఫర్డ్‌లో జరిగిన “టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ” కార్యక్రమంలో వాన్స్ మాట్లాడుతూ, “నా భార్య హిందువు. ఒకరోజు ఆమె నా మాదిరిగా క్రైస్తవ మతాన్ని నమ్ముతుందని ఆశిస్తున్నాను,” అన్నారు. అయితే వెంటనే, “అలా జరగకపోయినా నాకు ఎలాంటి సమస్య లేదు. ప్రతి ఒక్కరికీ తమ విశ్వాసం ఉండటానికి హక్కు ఉంది,” అని కూడా చెప్పారు. అయినప్పటికీ, ఆయన మొదటి వ్యాఖ్యలే సోషల్ మీడియాలో తీవ్ర ప్రతిస్పందన తెచ్చాయి.

JD Vance

భారతీయ అమెరికన్ సంఘాలు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. “ఇష్టపడి హిందువును పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె మతం గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనుచితం,” అని పలువురు సోషల్ మీడియాలో విమర్శించారు. హిందూ అమెరికన్ ఫౌండేషన్ కూడా వాన్స్ వ్యాఖ్యలను విమర్శిస్తూ, ఆయన భార్య ఉషా వాన్స్ విశ్వాసం తనపై చూపిన సానుకూల ప్రభావాన్ని ఆయన అంగీకరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

Also Read: Pak-Afghan: భారత్ కాదు.. అమెరికా నే..పాక్-ఆఫ్ఘన్ శాంతి చర్చలు విఫలం కావడానికి కారణం ఇదే

వివాదం పెరగడంతో వాన్స్ తన వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చారు. “నా భార్య ఉషా హిందువే. ఆమెకు మతం మారే ఆలోచన లేదు. కానీ మేమిద్దరం విశ్వాసం గురించి మాట్లాడుకుంటుంటాం. ఏది ఏమైనా, నేను ఆమెను ప్రేమిస్తూనే ఉంటాను, మద్దతు ఇస్తూనే ఉంటాను,” అని అన్నారు. అలాగే తన పిల్లలు క్రైస్తవ మతంలో పెరుగుతున్నారని తెలిపారు.

వివాదం నడుస్తున్న సమయంలో, టర్నింగ్ పాయింట్ ఈవెంట్‌లో వాన్స్, ఎరికా కిర్క్‌ను కౌగిలించుకున్న ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ అవడంతో మరింత చర్చ మొదలైంది. కొందరు 2028 అధ్యక్ష ఎన్నికల్లో వాన్స్ తన భార్య హిందూ మతం కారణంగా వ్యతిరేకత ఎదుర్కొంటారని, అందుకే ఎరికా కిర్క్‌తో సాన్నిహిత్యం పెంచుతున్నారని వ్యాఖ్యానించారు.

JD Vance

జెడి వాన్స్ వ్యాఖ్యలు అమెరికాలో మత స్వేచ్ఛ, అంతర్మత వివాహాలపై కొత్త చర్చకు దారితీశాయి. ఆయన స్పష్టత ఇచ్చినప్పటికీ, సోషల్ మీడియాలో విమర్శల తుఫాన్ మాత్రం ఇంకా ఆగలేదు. హిందూ సమాజం మాత్రం “మతంపై ప్రేమకు రాజకీయ అర్థం ఇవ్వకండి” అని వాన్స్‌కు సందేశం పంపుతోంది.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *