Funky Teaser: హీరో విశ్వక్ సేన్ తాజా చిత్రం ‘ఫంకీ’ టీజర్ విడుదలైంది. ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, సినిమాపై భారీ అంచనాలు పెంచుతోంది. ముఖ్యంగా ‘జాతిరత్నాలు’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాను తీసిన దర్శకుడు అనుదీప్ కె.వి. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
అనుదీప్ మార్క్ కామెడీతో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్
‘ఫంకీ’ టీజర్‌ను చూస్తే, ఈ సినిమా పక్కా కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతుందని స్పష్టమవుతోంది. అనుదీప్ తనదైన శైలిలో రాసిన కామెడీ డైలాగులు, విచిత్రమైన పాత్రలు,[ వారి మధ్య వచ్చే ఫన్నీ సిచ్యుయేషన్స్‌తో టీజర్ నిండిపోయింది. టీజర్‌లో వినిపించిన “చిన్నప్పుడు అమ్మ చెప్పిన మాటలు మనం వినలేదురా” అనే ఓపెనింగ్ డైలాగ్, వెంటనే వచ్చిన ఫన్నీ సమాధానం.. ఇది అనుదీప్ మార్క్ సినిమా అని చెప్పకనే చెప్పింది.
విశ్వక్ సేన్ మాస్ లుక్, పంచ్ డైలాగులు
ఇక, ‘మాస్ కా దాస్’ అని పిలవబడే విశ్వక్ సేన్ ఈ సినిమాలో మాస్ లుక్‌లో, తనదైన మేనరిజంతో కనిపించాడు. ఆయన చెప్పిన పంచ్ డైలాగులు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. హీరోయిన్‌గా కయాదు లోహర్ నటిస్తోంది. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం సినిమాకు మరో ఆకర్షణగా నిలవనుంది.
Also Read: Vijay Deverakonda: విజయ్–కీర్తి సురేష్ కాంబినేషన్‌లో కొత్త సినిమా ‘రౌడీ జనార్ధన్’ ప్రారంభం!
మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు సిద్ధం
విశ్వక్ సేన్ గత సినిమాలు ‘మెకానిక్ రాకీ’, ‘లైలా’ ఆశించినంత విజయం సాధించలేకపోయాయి. ముఖ్యంగా ‘లైలా’ సినిమాకు ట్రోలింగ్ ఎదురైనప్పుడు, విశ్వక్ అభిమానులకు క్షమాపణలు చెప్పి, ఇకపై మంచి సినిమాలే చేస్తానని హామీ ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకుంటూ, ఈసారి ‘ఫంకీ’ వంటి కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.
నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. ‘జాతిరత్నాలు’ ఫేమ్ డైరెక్టర్, విశ్వక్ సేన్ మాస్ మేనరిజం కలగలిసిన ఈ ‘ఫంకీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.