Champions Trophy 2025: టీమ్ ఇండియా స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం గాయం కారణంగా జట్టుకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీకి ఈ ప్రపంచ మేటి బౌలర్ అందుబాటులో ఉండే విషయంపై ఇప్పటికీ సందిగ్ధత నెలకొంది. తాజాగా వచ్చిన రిపోర్టుల ప్రకారం జస్ప్రీత్ బుమ్రా టోర్నమెంటులో పాల్గొనడం అనుమానంగానే మారింది.
ప్రపంచంలోనే ప్రస్తుతం బెస్ట్ ఫాస్ట్ బౌలర్ గా పరిగణింపబడుతున్న టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు తరఫున ఆడే అవకాశాలు రోజురోజుకూ సన్నగిల్లుతున్నాయి. ఆస్ట్రేలియా సిరీస్ కు గాయం కారణంగా చివరి టెస్టు మధ్యలో తప్పుకున్న జస్ప్రీత్ బుమ్రా… ఇంగ్లాండు తో జరగబోయే వన్డే సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్లకు అందుబాటులో లేడని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Coldplay Ahmedabad Concert: ది బెస్ట్ బౌలర్..బుమ్రా కోసం స్పెషల్ సాంగ్ పాడిన కోల్డ్‌ప్లే బ్యాండ్
Champions Trophy 2025: ఇక చాంపియన్ ట్రోఫీ జట్టులో బుమ్రాకి స్థానం కల్పించిన బీసీసీఐ… ఇంగ్లాండ్ తో జరగబోయే మూడవ వన్డే కు అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నారు. అయితే న్యూజిలాండ్ లో ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న అతను అందుబాటులో ఉండే అవకాశాలు చాలా తక్కువ అని రిపోర్ట్లు బయటికి వచ్చాయి. అక్కడి డాక్టర్లు అతని బౌలింగ్ ఫిట్ నెస్ పట్ల అంత ఆశాజనకంగా లేనట్లు తెలుస్తోంది.
సెలక్టర్లు సైతం బుమ్రా… చాంపియన్స్ ట్రోఫీ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధిస్తే అదొక అద్భుతంగా అవుతుందని భావిస్తున్నారు. శరీరంలోని వెన్ను భాగంలో అతనికి అధిక ఒత్తిడి గురి కావడంతో… కోలుకునేందుకు ఎక్కువ సమయమే పడుతుంది. ఇక హుటాహుటిన జట్టులోనికి సగం ఫిట్నెస్ తో ఆడిస్తే మొదటికే మోసం వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కనుక బుమ్రా సమయానికి ఫిట్ గా లేకపోతే మహమ్మద్ షమీ పేస్ దళానికి నేతృత్వం వహిస్తాడు. అయితే ఫిట్నెస్ కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఇటువంటి సమయంలో యువ పేసర్ హర్శిత్ రానా జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.