Japanese Woman: హర్యానాలో 14వ అంతస్తు బాల్కనీ నుంచి పడి జపాన్ మహిళ మరణించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి;
మడోకా తమనో (34) జపాన్‌కు చెందిన మహిళ. ఆమె తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి హర్యానాలోని గురుగ్రామ్‌లోని ఒక అపార్ట్‌మెంట్ లోని 14వ ఫ్లాట్‌లో నివసిస్తోంది.
అయితే ఆ అపార్ట్మెంట్ నేలపై మడోకా తమనో రక్తపు మడుగులో చనిపోయి పడి ఉన్నట్లు స్థానిక పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సంఘటన ఎలా జరిగింది అనే విషయం నిర్ధారణ కాలేదు. అక్కడి వారు దానికి సంబంధించి ఎటువంటి సమాచారం ఇవ్వలేకపోయారు. అయితే, సీసీ ఫుటేజీల ఆధారంగా ఏమి జరిగింది అనే విషయాన్ని నిర్ధారించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Viral Video: ఖరీదైన కారు.. చిల్లర చేష్టలు.. రోడ్డుమధ్యలో కారు ఆపి వీడు చేసిన పని చూస్తే ఛీ అంటారు..
మహిళ మృతదేహాన్ని పోస్ట్ మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు. పొరపాటున ఆమె 14వ అంతస్తు బాల్కనీ నుండి పడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికాంగా భావిస్తున్నట్టు చెబుతున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాకా మరింత స్పష్టత వస్తుందని వారు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.