Jani Master: అత్యాచార ఆరోపణ కేసులో అరెస్ట్ అయ్యి, బెయిల్ పై బయటకు వచ్చిన జానీ మాస్టర్ కమ్ బ్యాక్ కోసం గట్టి ప్రయత్నమే చేస్తున్నట్టు తెలుస్తోంది. జాతీయ అవార్డుకు ఎంపికై, తృటిలో దానిని అందుకోవడం మిస్ అయి జానీ మాస్టర్ రెట్టింపు కసితో తానేమిటో నిరూపించుకోవాలను కుంటున్నాడని సన్నిహితులు చెబుతున్నారు. ఇటీవల తెలుగు డాన్సర్స్, డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ ఎన్నికలు కూడా జానీ మాస్టర్ ప్రమేయం లేకుండా జరిగిపోయాయి. అవి న్యాయబద్థంగా జరిగినవి కాదని జానీ మాస్టర్ ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో ఇవాళ సూపర్ డూపర్ హిట్ అయిన ‘పుష్ప-2’ లో ఓ పాటకు కొరియోగ్రఫీ అందించే ఛాన్స్ ను కూడా జానీ మాస్టర్ కోల్పోయారు. ఈ నేపథ్యంలో భారీ చిత్రంతో అతను కమ్ బ్యాక్ కు ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. అయితే అదే సినిమా అనేది కొద్ది రోజుల్లో రివీల్ కానుంది. ఇదే సమయంలో హిందీ సినిమా ‘బేబీ జాన్’కు సైతం జానీ మాస్టర్ నృత్య రీతులు సమకూర్చాడు. ఈ పాట ఇప్పుడు వీక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ ను అందుకుంటోంది.
