Jani Master: అసిస్టెంట్ డాన్సర్పై అత్యా చారం కేసులో బెయిల్ పొందిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జైలు నుంచి విడుదలయ్యాక ఎమోషనల్ పోస్ట్ చేశారు. 37 రోజుల జైలు జీవితం తర్వాత తన కుటుంబ సభ్యులను కలుసుకున్న వీడియోను పంచుకున్నారు. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని ఆశిస్తున్నట్లు రాసుకొచ్చారు. జీవితంలో తన కుటుంబం ఎదుర్కొన్న ఈ దశ ఎల్లప్పుడూ తన హృదయాన్ని గుచ్చుకుంటుందని పేర్కొన్నారు.
