Janhvi Kapoor

Janhvi Kapoor: తప్పతాగి బాలిక ప్రాణం తీసిన యువతి.. జాన్వీ కపూర్ సీరియస్

Janhvi Kapoor: కొంతమంది తప్పతాగి నిర్లక్ష్యంతో చేసే పనుల వల్ల ఇతరులు బలవుతున్నారు. ఇక అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు సైతం తప్పతాగి వాహనాలు నడుపుతూ ఇతరుల ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా రాజస్థాన్​ జైపూర్​లో ఇటువంటి ఘటనే జరిగింది. ఓ యువతి ఫుల్​గా తాగి ర్యాష్ డ్రైవింగ్ చేసి ఓ బాలిక ప్రాణం తీసింది. ఆపై పారిపోయేందుకు యత్నించగా..స్థానికులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై స్టార్ హీరోయిన్ జాన్వీకపూర్ సైతం సీరియస్ అయ్యింది. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.

ప్రభుత్వాలు ట్రాఫిక్ రూల్స్ ఎంత స్ట్రిక్ట్ చేసినప్పటికీ కొంతమంది తమ నిర్లక్ష్యధోరణిని వీడడం లేదు. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు కూడా తప్పతాగి వాహనం నడుపుతూ ఇతరుల ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా రాజస్థాన్​లోని జైపూర్​ సిటీలో దారుణం జరిగింది. ఓ యువతి ఫుల్​గా తాగి కారు నడిపింది. ఈ క్రమంలో ర్యాష్ డ్రైవింగ్​తో ముందు వస్తోన్న ఓ బైక్​ను ఢీకొట్టగా.. 14ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది.

Also Read: Dimple Hayathi: డింపుల్ హయాతికి సరికొత్త అవకాశం.. హాట్ బ్యూటీ హిట్ కొడుతుందా?

మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే కారును ఆపకుండా వెళ్లేందుకు ఆ యువతి ట్రై చేసింది. దీంతో స్థానికులు ఆమెను ఆపి.. గట్టిగా నిలదీశారు. కారులో మద్యం బాటిళ్లు, వాళ్లంతా తాగి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు ఆవేషంతో ఊగిపోయారు. వారిపై దాడికి యత్నించగా.. తనను వదిలెయ్యాలని యువతి వేడుకుంది. ఇంతలో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని యువతిని అరెస్ట్ చేసి.. విచారణ చేపట్టారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారింది.

ఈ ఘటనపై స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ స్పందించింది. ఇంత నిర్లక్ష్యపు ప్రవర్తనను ఎవరైనా అనుమతిస్తారా? మద్యం తాగి వాహనం నడపడం వల్ల చుట్టూ ఉన్న వారి ప్రాణాలకి ఎంత ముప్పు అనేది ఆలోచిస్తున్నారా? అని ప్రశ్నించింది. ఈ యాక్సిడెంట్ గురించి తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్లు చెప్పింది. ఇటీవ‌ల మ‌ద్యం కార‌ణంగా జరిగే ప్ర‌మాదాల‌తో ఎంతో అమాయ‌కులు ప్రాణాలు కోల్పోతున్నారు. చట్టాలను మనం ఎందుకు గౌరవించడం లేదు? కనీస అవగాహన లేకుండా చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం. ఈ తీరు మారాలి అంటూ జాన్వీ క‌పూర్ ఇన్‌స్టా వేదిక‌గా త‌న ఆవేదన తెలియ‌జేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *