Janhvi Kapoor: తుషార్ జలోటా దర్శకత్వంలో సిద్దార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ జంటగా ‘పరమ్ సుందరి’ చిత్రం రూపొందుతోంది. ఈ క్రాస్-కల్చరల్ రొమాంటిక్ డ్రామా ఉత్తరాది యువకుడు, దక్షిణాది అమ్మాయి ప్రేమకథ చుట్టూ తిరుగుతుంది. సిద్దార్థ్ నార్త్ ఇండియన్ యువకుడిగా, జాన్వీ కేరళ సుందరిగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రమోషనల్ వీడియోలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఈ జానర్‌లో ఇప్పటివరకూ ఇలాంటి కథను ఎవరూ తెరకెక్కించలేదు, రెండు విభిన్న సంస్కృతుల సమ్మేళనంతో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.
Also Read: Ram Pothineni: కొత్త జోనర్‌లో అడుగుపెట్టబోతున్న రామ్ పోతినేని?
Janhvi Kapoor: తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలో జాన్వీ కేరళ అమ్మాయిగా చీరలో, మల్లెపూలతో అద్భుతంగా కనిపిస్తోంది. సిద్దార్థ్ ఆమె తలపై చేతులు అడ్డుపెట్టి చినుకుల నుండి కాపాడుతూ కనిపించాడు. ముంబైలోని మాడ్డాక్ ఫిల్మ్స్ కార్యాలయంలో తీసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. కేరళలోని పచ్చని ప్రకృతి నడుమ చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. షూటింగ్ పూర్తయి, ప్రమోషన్‌లకు సిద్ధమవుతున్న ఈ చిత్రం జులై 25న విడుదల కానుంది.