Janhvi Kapoor: బాలీవుడ్‌లో వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న జాన్వీ కపూర్‌కు టాలీవుడ్‌లోనే మంచి భవిష్యత్తు ఉందని దర్శకుడు అశోక్ తేజ అన్నారు. శ్రీదేవి వారసురాలిగా తెలుగు ప్రేక్షకులు ఆమెను ఎక్కువగా ఆదరిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: Dude OTT: ఓటీటీలోకి ‘డ్యూడ్’!
జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో ‘పరం సుందరి’, ‘సన్నీ సంస్కారి కి తులసి కుమారి’ వంటి చిత్రాలు ఫ్లాప్ కావడంతో కెరీర్‌లో సంక్షోభం నెలకొన్నది. ఈ నేపథ్యంలో ‘దేవర’తో సాలిడ్ హిట్ కొట్టిన ఈ బ్యూటీ, ‘పెద్ది’ వంటి పెద్ద తెలుగు చిత్రాల్లో నటిస్తూ టాలీవుడ్ వైపు మొగ్గు చూపుతోంది. ఈ విషయంపై ‘ఓదెల రైల్వే స్టేషన్ 2’ దర్శకుడు అశోక్ తేజ మాట్లాడుతూ.. హిందీ కంటే తెలుగులోనే జాన్వీకి ఎక్కువ క్రేజ్ ఉంటుందని, శ్రీదేవి అభిమానులు ఆమెను గుండెల్లో పెట్టుకుంటారని సలహా ఇచ్చారు. బాలీవుడ్‌లో స్టార్ కిడ్స్ మధ్య పోటీ ఎక్కువ కాగా, టాలీవుడ్‌లో శ్రీదేవి ఫ్యాన్ బేస్ ఇప్పటికీ బలంగా ఉందని ఆయన అభిప్రాయం. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

