Janhvi Kapoor

Janhvi Kapoor: జాన్వీ కపూర్ మిడీ ఖరీదు రూ.3.9 లక్షలు

Janhvi Kapoor: తనదైన అందం, ప్రతిభతో భారీగా ఫోలోయింగ్ పెంచుకుంది జాన్వీ కపూర్. కెరీర్ పరంగా ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్న ఈ భామ సోషల్ మీడియాలోనూ స్పీడ్ చూపిస్తోంది. ఇన్ స్టాగ్రామ్ వేదికగా నిరంతరం అభిమానులకు అప్డేట్ లను అందించే ఈ బ్యూటీ తాజాగా లండన్ లో ప్రత్యక్షమైంది. అక్కడ జరుగుతున్న వింబుల్డన్ -2025 సెమీ ఫైనల్ మ్యాచ్లో తన ప్రియుడు శిఖర్ పహారియర్ తో కలిసి మెరిసింది. ఓ స్పెషల్ డిజైనర్ మిడీ డ్రెస్ ధరించి కనిపించింది. దీంతో యూత్ ప్రస్తుతం తమ ఫోకస్ అంతా ఆమిడీపైనే పెట్టారు. ఆ స్పెషల్ డ్రెస్ గురించి ఆరా తీస్తున్నారు. జాన్వీ టోన్డ్ సొగసులను ఆవిష్కరిస్తున్న ఈ స్పెషల్ మిడీ డ్రెస్ రొటీన్ పొట్టి మిడీ కంటే భిన్నమైన ఎంపికలా ఉంది.

Also Read: Disha Patani: సోషల్ మీడియాలో సెగలు పుట్టించిన దిశా పటానీ!

ఇక దాని ఖరీదు ఎంతై ఉంటుందనే విషయమై ఆలోచిస్తున్న యూత్ ఆన్లైన్ లో వెతికి సుమారు రూ.3.9 లక్షలు అని లెక్కలు తీస్తున్నారు. ఆ లాంగ్ మిడీకి తగ్గట్టుగా కళ్లద్దాలు కూడా ధరించింది జాన్వీ. ఫ్రీస్టయిల్ లో ఈ లుక్ సంథింగ్ స్పెషల్ గా ఎలివేట్ అయింది. దీంతో ఈ బ్యూటీ ట్రెడిషనల్ దుస్తుల్లోనూ టూ హాట్ గా ఉందంటూ అభి మానులు కామెంట్ చేస్తున్నారు. సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆమె రామ్ చరణ్ సరసన పెద్ద మూవీలో నటిస్తోంది.

Janhvi Kapoor

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *