Janhvi Kapoor

Janhvi Kapoor : కోలీవుడ్ పై కన్నేసిన జాన్వీ బ్యూటీ!

Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తన నటనతో ఇండస్ట్రీలో సత్తా చాటుతోంది. ఎన్టీఆర్‌తో ‘దేవర’ సినిమాతో టాలీవుడ్‌లో సంచలన ఎంట్రీ ఇచ్చిన ఈ భామ, ఆ సినిమా సక్సెస్‌తో ఆఫర్ల సునామీలో మునిగింది. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన ‘పెద్ది’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది.

ఇప్పుడు జాన్వీ కపూర్ తమిళ ఇండస్ట్రీలోనూ అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. కోలీవుడ్ సమాచారం ప్రకారం, ప్రముఖ దర్శకుడు పా రంజిత్ జాన్వీతో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. సామాజిక అంశాల చుట్టూ నడిచే ఈ వెబ్ సిరీస్‌లో జాన్వీ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుందని టాక్. పా రంజిత్ చెప్పిన కథకు జాన్వీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఆమె నటనతో మరోసారి అలరించడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.

Also Read: Srileela-Karthik Aryan: మళ్ళీ దొరికిపోయిన శ్రీలీల, కార్తిక్ ఆర్యన్‌!

Janhvi Kapoor: ఒకవేళ ఈ ప్రాజెక్ట్‌కు జాన్వీ ఓకే చెప్పి, తన పెర్ఫార్మెన్స్‌తో తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంటే, ఆమె కెరీర్‌లో ఇదొక మైలురాయి అవుతుందని సినీ వర్గాలు అంటున్నాయి. జాన్వీ నిర్ణయం కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 దేవర లోని చుట్టమల్లె సాంగ్ :

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *