Janasena Party Formation Day: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేడు (శనివారం, మార్చి 14, 2026) అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించనున్నారు. జనసేన పార్టీ స్థాపించి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఈసారి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆడంబరాలకు దూరంగా గిరిజన గడ్డపై జరుపుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. పాడేరు నియోజకవర్గంలోని నందిగరువు గిరిజన గ్రామంలో స్థానిక ఆదివాసీలతో కలిసి ఆయన ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు.
పవన్ కళ్యాణ్ పర్యటన విశేషాలు
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం, పవన్ కళ్యాణ్ తన పర్యటనను గిరిజన సంక్షేమమే ధ్యేయంగా కొనసాగిస్తున్నారు.
ఉదయం 9 గంటలకు పాడేరు చేరుకొని ఆయన, ఓనూరు జంక్షన్ వద్ద జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించనునారు.
12 ఏళ్ల ప్రస్థానం
2014లో స్థాపించబడిన జనసేన పార్టీ, గడిచిన పన్నెండేళ్లలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నేడు రాష్ట్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఎదిగింది. గత ఎన్నికల్లో సాధించిన విజయం తర్వాత జరుపుకుంటున్న ఈ ఆవిర్భావ దినోత్సవం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
