Janampalli Anirudh Reddy: కాంగ్రెస్ పార్టీలో అలజడి సృష్టించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్‌పై వారిలో ఉన్న జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి ఎట్టకేలకు స్పందించారు. ఆయన తాము పాల్గొన్న మీటింగ్.. అనంతర పరిణామాలపై ఘాటుగా స్పందించారు. ఇప్పటివరకూ ఆ అసమ్మతికి ఫుల్‌స్టాప్ పడేలా లేదని ఆయన మాటలే చెప్తున్నాయి. మరింత ఆజ్యం పోసుకునేలా ఉన్నట్టు తేటతెల్లమవుతున్నది.
Janampalli Anirudh Reddy: ఎమ్మెల్యేలు సమావేశమైన మాట వాస్తవమేనని అనిరుధ్‌రెడ్డి ఒప్పుకున్నారు. అయితే ఫైళ్ల క్లియరెన్స్ తమ ఉద్దేశం కాదని తేల్చిచెప్పారు. తాను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వద్ద ఎలాంటి ఫైల్ పెట్టలేదని స్పష్టం చేశారు. ఆ ఫైళ్లు ఏమిటో రెవెన్యూ మంత్రి పొంగులేటి, ఎంపీ మల్లు రవి తేల్చిచెప్పాలని డిమాండ్ చేశారు.
Janampalli Anirudh Reddy: ఎవరి చరిత్ర ఏమిటో అందరికీ తెలుసు అని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తెలిపారు. ఇది సీక్రెట్ మీటింగ్ కాదని, బహిరంగంగానే సమావేశం అయ్యామని చెప్పారు. ఇచ్చిన హామీలపై తాము ఉమ్మడిగా అడిగేందుకే సమావేశం అయ్యామని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డికి చెప్పుకొని తాము నిధులు అడుగుతామని చెప్పారు.
Janampalli Anirudh Reddy: అయితే నర్మగర్భంగా ఆయన చెప్పిన విషయాలు ఉన్నాయని తెలుస్తున్నది. రేపే ఏఐసీసీ రాష్ట్ర పరిశీలకురాలు దీపాదాస్ మున్షిని కలుస్తామని అనిరుధ్‌రెడ్డి చెప్పారు. అధిష్టానాన్ని కూడా కలుస్తామని ఆయన చెప్పారు. ఆ తర్వాతే అన్ని వివరాలు వెల్లడిస్తామని, ఇప్పుడే అన్నీ చెప్పలేమని వివరించారు.