Janampalli Anirudh Reddy: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కోనసీమ వ్యాఖ్యలపై తెలంగాణ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేయగా, తాజాగా కాంగ్రెస్ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి కూడా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించారు. కోనసీమ పచ్చదనానికి తెలంగాణ నేతల దిష్టి తగిలిందని పవన్ కల్యాణ్ ఇటీవల వ్యాఖ్యానించారు.
Janampalli Anirudh Reddy: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగింది. పవన్‌కల్యాణ్‌వి తెలివి తక్కువ మాటలని, మెదడుకు పని చెప్పకుంటా చేసే వ్యాఖ్యలు ఇలాగే ఉంటాయని విమర్శించారు. మా దిష్టి కోస్తాకు తగలడం కాదు.. ఇన్నేళ్లుగా వాళ్ల దిష్టి మా తెలంగాణకు, హైదరాబాద్‌కు తగిలింది.. అని జగదీశ్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Janampalli Anirudh Reddy: తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. పవన్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. అలా మాట్లాడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. వెంటనే ఆయన తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మా దిష్టి తగిలితే అసలు పవన్ కల్యాణ్ గెలిచేవారేనా? అని అనిరుధ్‌రెడ్డి ప్రశ్నించారు.

