Jana Nayagan: తలపతి విజయ్ నటించిన #JanaNayagan చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ “తలపతి కచోరి” దివాళీ సందర్భంగా రిలీజ్ కానుంది. అనిరుధ్ రవిచందర్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ పాట, విజయ్ అభిమానులకు ఉత్సాహాన్ని అందించనుంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో, KVN ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 9, 2026న విడుదల కానుంది. ఈ సినిమా విజయ్ రాజకీయ ప్రవేశానికి ముందు చివరి చిత్రంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. “తలపతి కచోరి” పాట యువతను ఆకట్టుకునే ఎనర్జిటిక్ ట్రాక్‌గా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఈ పాటని శేఖర్ కొరియోగ్రఫీ చేయనుండగా, పూజా హెగ్డే, మమిత బైజు కలిసి విజయ్ తో డాన్స్ చేయనున్నారని తెలుస్తుంది. ఈ సినిమా కథ భగవంత్ కేసరి నుంచి స్ఫూర్తి పొందినట్లు ప్రచారం జరుగుతోంది, అయితే నిర్మాతలు కథ వివరాలను రహస్యంగా ఉంచారు. సంక్రాంతి బాక్సాఫీస్‌లో ఈ చిత్రం భారీ హిట్ కొట్టనుందని అంచనాలు ఉన్నాయి.

