Jammu Kashmir: జమ్ముకశ్మీర్ రాష్ట్రం పహల్గాం ఉగ్రదాడిలో మృతుల కుటుంబాలకు, బాధిత కుటుంబాలకు జమ్ముకశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ ఉగ్రదాడిలో 27 మంది పర్యాటకులు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. ఈ దాడిలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేయనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు.
