Jammu Kashmir: జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ రచ్చ రచ్చయింది. అధికార కాంగ్రెస్ కూటమి వర్సెస్ బిజెపి కూటమి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఒకరినొకరు దూషించుకున్నారు. ఒకరిపై ఒకరు పేపర్లు విసురుకున్నారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆర్టికల్ 370 బ్యానర్‌ను అసెంబ్లీలో ప్రదర్శించడం పట్ల బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంజినీర్ రషీద్ సోదరుడు, అవామీ ఇతెహద్ పార్టీ ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ షేక్.. అసెంబ్లీలో ఆర్టికల్ 370 బ్యానర్‌ను ప్రదర్శించాడు.
అయితే ఆ బ్యానర్‌ను ప్రదర్శించడం పట్ల ప్రతిపక్ష నేత సునిల్ శర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. ఇరు వర్గాల ఎమ్మెల్యేలు ఒకర్ని ఒకరు తోసుకున్నారు. దీంతో అసెంబ్లీని వాయిదా వేశారు. అధికార, విపక్ష సభ్యులు తీవ్ర స్థాయిలో దూషణలు చేసుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.