Jammu and Kashmir: ఎన్నికలు ముగిసిన తర్వాత కశ్మీర్ నుంచి భద్రతా బలగాలను తగ్గించారు. బలగాలు ఉపసంహరించుకోగానే ఉగ్రవాదులు లోయలో దాడులు ప్రారంభించారు. వివిధ ప్రాంతాల్లో తమ ఉనికిని చాటుకునే తాపత్రయం. ఈ దాడుల ద్వారా కాశ్మీర్ ఇప్పటికీ తమ కంచుకోట అని చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఉగ్రవాదులు.
జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడులకు కారణాన్ని వివరిస్తూ రిటైర్డ్ మేజర్ జనరల్ జిడి బక్షి.. కాశ్మీర్‌లో మన నిఘా చాలా బలంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదులు ఎక్కువ కాలం మనుగడ సాగించలేరని అయన చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Uttar Pradesh: జడ్జిపై లాయర్ల తిరుగుబాటు.. కోర్టులో రచ్చ.. రచ్చ..
Jammu and Kashmir: గత రెండు వారాల్లో బారాముల్లా, త్రాల్, షోపియాన్, అఖ్నూర్, గందర్‌బల్ ప్రాంతాల్లో 5 ఉగ్రవాద దాడులు జరిగాయి. ఇందులో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. ఇతర రాష్ట్రాల నుంచి పని కోసం వచ్చిన 8 మందిని కూడా ఉగ్రవాదులు హతమార్చారు.
అక్టోబర్ 8న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. పది రోజుల తర్వాత అక్టోబర్ 18న లోయలో వరుస ఉగ్రదాడులు మొదలయ్యాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత కూడా ఇదే పరిస్థితి కనిపించింది. అప్పుడు ఉగ్రవాదులు జమ్మూకు లక్ష్యంగా చేసుకున్నారు. జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడగా, ఐదు రోజుల తర్వాత జూన్ 9న ఉగ్రదాడుల పర్వం మొదలైంది. జమ్మూలో కేవలం 30 రోజుల్లో 7 ఉగ్రదాడులు జరిగాయి.