Jallikattu: జల్లికట్టు పోటీలు చూస్తూ ఒళ్లు జలదరిస్తుంది. మరి ఆ పోటీల్లో పాల్గొనే యువకులకు ఎలా ఉంటుంది. ఎద్దులతో వీరోచిత పోరులో చాకచక్యంగా తప్పించుకుంటారు కొందరు. తీవ్రగాయాల పాలవుతారు ఇంకొందరు. మరికొందరు మృత్యువు పాలవుతారు. మరి ఆ పోటీల్లో గెలిస్తే భారీ బహుమతులు వారి సొంతం. ఇలాంటి పోటీలను కేంద్రం కొంతకాలం నిషేధించినా, సంప్రదాయ పోటీల్లో భాగంగా మళ్లీ అనుమతులు ఇవ్వడం గమనార్హం. తమిళనాడులో పలుచోట్ల జరిగే ఈ పోటీల్లో వేలాది మంది యువత పాల్గొంటూ సందడి చేస్తుంటారు.
Jallikattu: తమిళనాడు రాష్ట్రంలోని మదురై అలంగనల్లూరులో జల్లికట్టు పోటీల్లో 1,000 ఎద్దులు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో 600 మంది యువకులు కేరింతలు కొడుతూ పాల్గొన్నారు. ఈ పోటీల్లో భద్రత కోసం 2000 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొనడం గమనార్హం. రెండు రోజులపాటు జరిగిన ఈ పోటీల్లో ఒకరు దుర్మరణం పాలయ్యారు. సుమారు 100 మందికి పైగా యువకులు గాయాలపాలయ్యారు. వీరిలో 22 మంది పోలీసులే ఉన్నారు.
Jallikattu: ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు భారీ బహుమతులే సొంతమవుతాయి. విజేతగా నిలిచిన యువకుడికి కారు బహుమతిగా ఇస్తారు. ఆ తర్వాత బహుమతి ట్రాక్టర్, ఆటోను ఇంకో బహుమతిగా విజేతలకు అందజేస్తారు. గతంలో షీల్డులనే బహుమతులుగా ఇచ్చేవారు. కానీ, రానురాను దాతలు పెరగడంతో విలువైన బహుమతులను ఇస్తూ వస్తున్నారు.

