Jaipur Bomb Blast Case

Jaipur Bomb Blast Case: జైపూర్ బాంబు పేలుళ్ల కేసు.. 17 ఏళ్ల తరువాత దోషులకు శిక్ష

Jaipur Bomb Blast Case: 17 ఏళ్ల క్రితం జైపూర్‌లో జరిగిన వరుస పేలుళ్లలో లైవ్ బాంబులను స్వాధీనం చేసుకున్న కేసులో దోషులుగా తేలిన నలుగురు ఉగ్రవాదులకు ప్రత్యేక కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది. ఏప్రిల్ 4న, ఈ కేసులో నలుగురు ఉగ్రవాదులు సైఫుర్రహ్మాన్, మహ్మద్ సైఫ్, మహ్మద్ సర్వర్ అజ్మీ, షాబాజ్ అహ్మద్‌లను కోర్టు దోషులుగా నిర్ధారించింది.

కోర్టు 600 పేజీల తీర్పును ఇచ్చింది. మే 13, 2008న, జైపూర్‌లో 8 వరుస పేలుళ్లు జరిగాయి. తొమ్మిదవ బాంబు చాంద్‌పోల్ బజార్‌లోని గెస్ట్ హౌస్ సమీపంలో కనుగొన్నారు. బాంబు పేలడానికి 15 నిమిషాల ముందు దానిని నిర్వీర్యం చేశారు. ఈ పేలుళ్లలో 71 మంది మరణించగా, 185 మంది గాయపడ్డారు.

జైపూర్ ప్రపంచవ్యాప్తంగా పింక్ సిటీగా ప్రసిద్ధి చెందిందని న్యాయమూర్తి రమేష్ కుమార్ జోషి తన ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ ప్రసిద్ధ నగరంలో అలాంటి సంఘటన జరిగింది లేదా కలిగించడానికి ప్రయత్నం జరిగింది. దీని కారణంగా జైపూర్ నగరం మొత్తం కదిలింది. ప్రజల హృదయాల్లో భీతి పుట్టింది. పరిపాలన ముందు ఒక సవాలు తలెత్తింది అని న్యాయమూర్తి అన్నారు.

Also Read: Mumbai Terrorist Attack: నేడు భారత్ కి రానున్న 26/11 ముంబై దాడి నిందితుడు

Jaipur Bomb Blast Case: దేశ ప్రజలే ఒకరిపై ఒకరు శత్రుత్వ భావాలను ఈ విధంగా కొనసాగిస్తే, దేశంలో ఎవరు సురక్షితంగా ఉంటారని ఆయన ఆ క్రమంలో పేర్కొన్నారు. బయటి నుండి ఎవరైనా వచ్చి అలాంటి నేరం చేస్తే దానికి వేరే అర్థం ఉంటుంది. కానీ దేశ పౌరులే కుట్ర పన్ని అలాంటి సంఘటనలు చేపడతారు. దీనిని ఊహించలేము కూడా. దేశ ప్రజలు దేశంలోని ఇతర ప్రజలకు శత్రువులుగా మారతారు. దీని గురించి ఆలోచించడం కూడా సాధ్యం కాదని న్యాయమూర్తి చెప్పార.

ఇప్పుడు మీరు నేరం చేశారు. దాని శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. ఈ సంఘటనలో దేశంలోని సామాన్య ప్రజలు గాయపడ్డారు, వారి మనోభావాలు దెబ్బతిన్నాయి, దానికి విలువ ఏమిటి. ఇది కూడా ఆలోచించదగిన ప్రశ్న అని ఈ సందర్బంగా న్యాయమూర్తి వైఖ్యానించారు

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *