Jailer: వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు రజనీకాంత్. ప్రస్తుతం కూలీ, జైలర్ 2 చిత్రాలతో బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు రజనీ జపాన్ ప్రేక్షకులను పలకరించబోతున్నారు. జపాన్ లో ఆయనకు సూపర్ క్రేజ్ ఉంది. అక్కడ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. రజనీ ముత్తు జపాన్ లో సెన్సేషనల్ హిట్ అందుకుంది. అందుకే ఇప్పుడు జైలర్ ని కూడా ఆ భాషలోకి డబ్ చేయబోతున్నారు మేకర్స్. పెట్టా, దర్బార్, అన్నాతే చిత్రాలతో పడిపోతున్న రజనీ గ్రాఫ్ నిలబెట్టిన మూవీ జైలర్. 2023లో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ. 650 కోట్లను కొల్లగొట్టింది. శివరాజ్ కుమార్, మోహన్ లాల్, జాకీష్రాఫ్ లాంటి దిగ్గజ స్టార్లు ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచారు. ఇప్పుడు ఈ సినిమా ఫిబ్రవరి 21 న జపాన్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు విడుదల అవుతుంది.
