Jailer 2 : సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న భారీ అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ సినిమా గురించి ఫ్యాన్స్‌లో ఉత్కంఠ రోజురోజుకూ పెరుగుతోంది. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందిస్తున్న ఈ చిత్రం, బ్లాక్‌బస్టర్ ‘జైలర్’కు తగ్గట్టుగా మరో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
రజినీకాంత్‌తో పాటు రమ్యకృష్ణ, వైజాస్ రవి లాంటి కీలక నటీనటులు పాల్గొన్న కామెడీ, ఫ్యామిలీ సన్నివేశాలు చిత్రీకరణ జరుగుతున్నాయి. నెల్సన్ మార్క్ కామెడీతో పాటు రజినీ స్టైలిష్ యాక్షన్ సీన్స్‌పై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.
Also Read: Mahesh Babu: SSMB29 రిలీజ్ డేట్ ఫిక్స్?
Jailer 2 : అనిరుద్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమాకు మరో హైలైట్‌గా నిలవనున్నాయని టాక్. ఇటీవల ‘కూలీ’ షూటింగ్‌ను పూర్తి చేసిన రజినీ, ఇప్పుడు పూర్తిగా ‘జైలర్ 2’పై ఫోకస్ చేశారు. ఈ 2025లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద మరో రికార్డు సృష్టించడం ఖాయమని అభిమానులు ధీమాగా ఉన్నారు.