బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటిఆర్ పై విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. కేటీఆరే ముందు తప్పు చేశారని ఫైర్ అయ్యారు. కొండా సురేఖను రెచ్చగొట్టి మీరే తన్నించుకున్నారని విమర్శించారు.కొండా సురేఖతో కొట్లాడటం అంత సులభం కాదన్నారు.
బీఆర్‌ఎస్‌కు కొంచెం కూడా పరిజ్ఞానం లేకపోవడం బాధాకరమన్నారు. రాహుల్ గాంధీపై కూడా కేటీఆర్ నిందలు వేయడం సరికాదన్నారు. 52 ఏళ్లు దేశాన్ని పాలించిన గాంధీ కుటుంబం గురించి ప్రజలకు బాగా తెలుసన్నారు.
కేటీఆర్ మరో పదేళ్లు ఓపిక పడితే పరిపూర్ణత చెందిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవచ్చని సూచించారు. రాజకీయ పరిపూర్ణతలేని నాయకుడిగా మిగలవద్దని హితవు పలికారు. కొండా సురేఖకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

