Jagga Reddy: మాస్ లీడర్ జగ్గారెడ్డి సినిమా రంగంలోకి ఎంట్రీ ఇస్తూ, ఉగాది పర్వదినాన తన సినిమా ఆఫీస్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఆయన కుమార్తె జయలక్ష్మీ రెడ్డి, భరత్ సాయి రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. పూజలో పాల్గొన్న జగ్గారెడ్డి, విద్యార్థి నాయకుడిగా మొదలై రాష్ట్ర నాయకుడిగా ఎదిగిన తన జీవిత కథను ‘జగ్గారెడ్డి’ టైటిల్‌తో తెరపై చూపిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్‌లో ఆయన మాస్ లీడర్‌గా ఫుల్ జోష్‌లో కనిపించారు.
Also Read: Etela Rajender: HCU భూముల వేలంపై ఎంపీ ఈటల ఆసక్తికర ట్వీట్
Jagga Reddy: జగ్గారెడ్డి మాట్లాడుతూ, “దర్శకుడు రామానుజం చెప్పిన కథలో నా ఒరిజినల్ పాత్రే ఉంటుంది. కుట్రలు, హత్యా ప్రయత్నాలు దాటి ఇక్కడి వరకూ వచ్చిన నా ప్రయాణం తెరపై కనిపిస్తుంది,” అన్నారు. దర్శకుడు రామానుజం మాట్లాడుతూ, “జగ్గారెడ్డి గారి జీవితంలోని మలుపులతో పాటు ప్రేమకథ కూడా ఉంటుంది. ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి,” అని చెప్పారు. నిర్మాత జయలక్ష్మీ రెడ్డి, “నాన్న జీవిత సంఘటనలు తెరపై చూడటం ఎగ్జైటింగ్‌గా ఉంది,” అన్నారు. త్వరలోనే టెక్నీషియన్స్, నటీనటుల వివరాలు వెల్లడవుతాయి.

